ఢమాలైన చైనా మొబైల్ మార్కెట్ , 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే !

ప్రపంచ మొబైల్ మార్కెట్లో సంచలననాలతో దూసుకుపోతున్న చైనా తన దేశంలో మాత్రం దిక్కులు చూస్తోంది. కనివినీ ఎరుగని రీతిలో నేల చూపులు చూస్తోంది.

By Hazarath
|

ప్రపంచ మొబైల్ మార్కెట్లో సంచలననాలతో దూసుకుపోతున్న చైనా తన దేశంలో మాత్రం దిక్కులు చూస్తోంది. కనివినీ ఎరుగని రీతిలో నేల చూపులు చూస్తోంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇలాంటి స్థితిలోకి రావడం టెక్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. ఆపిల్ , శాంసంగ్ లాంటి కంపెనీలకు ధీటుగా చైనా కంపెనీలో మార్కెట్లో తమ స్థానాన్ని కాపాడుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మార్కెట్ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా, అయితే స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా !జియో ఇంటర్నెట్ స్లోగా ఉందా, అయితే స్పీడ్ పెంచుకోవచ్చు ఇలా !

బీజింగ్, షాంఘైలలో..

బీజింగ్, షాంఘైలలో..

చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలలో చాలా మంది వినియోగదారులకు ఐఫోన్, శాంసంగ్‌ గెలాక్సీ వంటి స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాబట్టి వారు ఆ కంపెనీ ఫోన్ల మీదనే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని తెలిసింది.

2017లో వార్షిక సరుకు రవాణాలో..

2017లో వార్షిక సరుకు రవాణాలో..

ఎనిమిదేళ్లుగా పెరుగుతూ వచ్చిన చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ , 2017లో వార్షిక సరుకు రవాణాలో ఒక్కసారిగా 4 శాతం క్షీణించినట్టు తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్‌గా ఉన్న చైనాలో, అమ్మకాలు పడిపోవడం టెక్‌ వర్గాలను, కంపెనీలను విస్మయ పరుస్తోందని రీసెర్చ్‌ సంస్థ Canalys అంచనాలను వెల్లడించింది.

 చాలా మంది వినియోగదారులు..

చాలా మంది వినియోగదారులు..

ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నుంచి తక్కువ ధరలో దొరికే స్మార్ట్‌ఫోన్లకు మారిపోయారు. తమకు ప్రస్తుతం మరో ఫోన్ కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే కొనుగోళ్లు పడిపోయి మార్కెట్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కెనలిస్‌ విశ్లేషకుడు మో జియా చెప్పారు

హువాయి, ఒప్పో, వివోలు

హువాయి, ఒప్పో, వివోలు

కాగా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌లో హువాయి, ఒప్పో, వివోలు చైనీస్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్ నేలచూపులు చూస్తే, హువావే మాత్రం రెండంకెల వృద్ధిని సాధించినట్టు కెనాలిస్ రిపోర్టు వెల్లడించింది.

గత రెండేళ్లుగా..

గత రెండేళ్లుగా..

గత రెండేళ్లుగా చిన్న చైనీస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లకు ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడింది. అందుబాటులోని ధర, ఆకట్టుకునే ఫీచర్లతో చిన్న చైనీస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు వినియోగదారులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.

5జీ డివైజ్‌లు..

5జీ డివైజ్‌లు..

2019లో 5జీ డివైజ్‌లు మార్కెట్‌లోకి వచ్చేంత వరకు చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వృద్ధి ఉండదని ఈ రీసెర్చ్‌ సంస్థ తెలుపుతోంది. కాగా గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఫీచర్ ఫోన్లతోనే సరిపెట్టుకుంటున్నారు.

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని..

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని..

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని అందించడానికి ఒప్పో, వివోలు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న స్టోర్లను కూడా ఏర్పాటుచేశాయి. దీని ఫలితంగా 2016లో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ బాగానే పెరిగిందని రీసెర్చి సంస్థ తెలిపింది.

షియోమి, ఒప్పో లాంటి కంపెనీలు..

షియోమి, ఒప్పో లాంటి కంపెనీలు..

ఇక షియోమి, ఒప్పో లాంటి కంపెనీలు ఆసియా మార్కెట్లో మంచి ఫలితాలను రాబట్టాయి. ఈ కంపెనీలు ఇక్కడ తమ ఆధిపత్యాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నాయని ఇది ఆహ్వనించ దగ్గ పరిణామమని న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

 భవిష్యత్ లో చైనా మొబైల్స్ వినియోగం..

భవిష్యత్ లో చైనా మొబైల్స్ వినియోగం..

అయితే భవిష్యత్ లో చైనా మొబైల్స్ వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఇది ఆందోళన కలిగించే విషయమని ఎనాలసిస్టులు చెబుతున్నారు.చైనా కంపెనీలు ఇప్పుడు ఇండియా ఇండోనేషియాలోని ఆఫ్ లైన్ మార్కెట్ మీద తమ దృష్టిని నిలిపాయని వారు చెబుతున్నారు.

చైనా మొబైల్ కంపెనీలకు..

చైనా మొబైల్ కంపెనీలకు..

ఇదే విషయాలను ఇంతకు ముందు చైనా న్యూస్ ఏజెన్సీ China Academy of Information and Communications Technology (CAICT) వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. చైనా మొబైల్ కంపెనీలకు 2017 కలిసిరాలేదని ఆధిపత్యపో పోరులో వెనక్కి తగ్గిందని ఈ న్యూస్ ఏజెన్సీ కుండబద్దలు కొట్టింది.

153 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను..

153 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను..

గత డిసెంబర్ నెలలో అత్యంత ఘోరంగా 32.5 శాతం పడిపోయిందని ఇది చైనా కంపెనీలకు పెద్ద ప్రమాదకరమైన విషయమేనని ఆ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.కాగా చైనా కంపెనీ హువాయి గతేడాది 153 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసింది. గ్లోబల్ మార్కెట్లో 10 శాతం వాటాను ఆక్రమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌గా అవతరించిందని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

Best Mobiles in India

English summary
Annual smartphone shipments in China declined for the first time in 2017 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X