భారీ హ్యాకింగ్ షాక్, అమెజానే యూజర్ల డేటా గల్లంతు

ప్రపంచాన్ని రోజు రోజుకు హ్యాకింగ్ భూతం పట్టి పీడిస్తోంది. హ్యాకర్లు తమకు అనుకూలంగా ప్రతి దాన్ని మలుచుకుంటున్నారు.

|

ప్రపంచాన్ని రోజు రోజుకు హ్యాకింగ్ భూతం పట్టి పీడిస్తోంది. హ్యాకర్లు తమకు అనుకూలంగా ప్రతి దాన్ని మలుచుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అలాగే ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలు దినదినాభివృద్ధి చెందుతుంటంతో హ్యాకర్ల దృష్టి వీటి మీద పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతేడాది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ డేటా లీక్ ప్రకంపనలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేశాయి. ఈ మంటలు చల్లారక ముందే ఇప్పుడు అమెజాన్ వీరి భారీన పడింది. అమెజాన్ యూజర్ల డేటా లీక్ వార్తలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే..

 

పోర్న్ బ్యాన్ తరువాత జియో మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది!పోర్న్ బ్యాన్ తరువాత జియో మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది!

అమెజాన్ అతలాకుతలం

అమెజాన్ అతలాకుతలం

ఒకవైపు మార్కెట్‌ క్యాప్‌లో అమెరికాకు చెందిన ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. అయితే అంతే వేగంతో కిందకు జారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీవీ ఇందుకు యాంకర్‌తో ప్రేమలో పడిన అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ భార్యకుతో విడాకులకు సిద్ధమవడం ఓ కారణమైతే, అమెజాన్‌లో విక్రయదారుల భారీ డేటాలీక్‌తో అమెజాన్‌ వార్తల్లో నిలవడం మరో కారణంగా చెప్పవచ్చు.

అమెజాన్‌ ఇండియా పోర్టల్‌లో

అమెజాన్‌ ఇండియా పోర్టల్‌లో

అంతర్గత వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా పలు అమెజాన్‌ ఇండియా పోర్టల్‌లో విక్రయదారుల డేటా లీక్‌ అయింది. ముఖ్యంగా సెల్లర్స్‌ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైందని తెలుస్తోంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు అక్రమంగా బహిర్గతం కావడం కలకలం రేపింది.

వరుస డేటాలీక్స్‌
 

వరుస డేటాలీక్స్‌

వరుస డేటాలీక్స్‌ సోషల్‌ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ ఖాతాల డేటాబ్రీచ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్‌ ఇండియాలో మరో డేటా బ్రీచ్‌ కలకలం రేపింది.

ధృవీకరించిన అమెజాన్‌ ఇండియా

ధృవీకరించిన అమెజాన్‌ ఇండియా

అమెజాన్‌లో నమోదైన సెల్లర్స్‌ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్‌ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్‌లోడింగ్‌ సందర్భంగా సమస‍్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్‌ అంశాన్ని గమనించామని వెల్లడించింది.

పరిష్కరించడానికి వెంటనే చర్యలు

పరిష్కరించడానికి వెంటనే చర్యలు

అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రకటించింది. ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. గత ఏడాది కూడా అమెజాన్‌లో దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది.

150 మిలియన్ల రిజిస్టర్డ్‌ యూజర్లు

150 మిలియన్ల రిజిస్టర్డ్‌ యూజర్లు

అమెజాన్‌లో దాదాపు 150 మిలియన్ల రిజిస్టర్డ్‌ యూజర్లు వుండగా, సుమారు 40 లక్షలమంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ‍్యంలో తాజా డాటాలీక్‌ ప్రభావానికి ఎంతమంది గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్‌ ఫిర్యాదు చేశారనే దానిపై స్పష్టత లేదు.

Best Mobiles in India

English summary
Another data breach? Amazon India leaks sellers information in tech error more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X