కొత్త సోషల్ మీడియా యాప్.. టాప్ ఫీచర్లు సహా ఎన్నో.. ??
ప్రస్తుత ప్రపంచం సుమారుగా సోషల్ మీడియా యుగమే అని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం సహా ఎన్నో యాప్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలోకి మరో సోషల్ మీడియా యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇండో- అమెరికన్ పారిశ్రామికవేత్త రవికాంత్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న నావల్ సంస్థ 'Airchat' యాప్‌ను రూపొంచింది.
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్‌లకు పోటీ పడే విధంగా ఎయిర్‌చాట్‌ను తయారుచేసినట్లు సంస్థ వెల్లడించింది. మరియు ఈ యాప్ వినియోగదారులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుందని సంస్థ తెలిపింది. ఎయిర్‌చాట్ యాప్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉందని సంస్థ 'Naval' తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. iOS బీటా వెర్షన్ అందుబాటులో ఉండగా.. త్వరలో ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ రానున్నట్లు తెలుస్తోంది. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంల మాదిరిగా ఎయిర్‌చాట్‌ను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఎయిర్‌చాట్ గురించి నావల్ సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియా సామాజికం కాదని.. ప్రత్యేక పనితీరును కలిగి ఉందని పేర్కొంది. కానీ చిట్‌చాట్, చిరునవ్వులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. తాము కొత్తగా ప్రయత్నం చేశామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించినట్లు చెప్పారు. ఎయిర్‌చాట్‌ను ఫాలో కావాలని మళ్లీ ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కావద్దంటూ సూచించింది.
ఈ ట్వీట్‌లో ఎయిర్‌చాట్ ఫీచర్లకు సంబంధించిన ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు అయిన క్లబ్‌హౌస్, టిక్‌టాక్‌లో ఉన్న కొన్ని మంచి ఫీచర్లను ఎయిర్‌చాట్ కలిగి ఉన్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ ఎయిర్‌చాట్ యాప్ గురించి పెద్దగా ఏం సమాచారం లేదు. కానీ ఎయిర్‌చాట్‌లో మల్టీలాగ్వేజ్ ట్రాన్సిక్రిప్షన్ సహా ఏఐ వినియోగంతో తన చాట్‌రూంను మరింత సహజంగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
వీటితోపాటు ఎయిర్‌చాట్ యాప్‌లో వివిధ అంశాలకు సంబంధించి వేర్వేరు చాట్‌రూం కలిగి ఉంటాయని సమాచారం. మీరు ఆ చాట్‌లో పొల్గొనవచ్చు లేదా జరుగుతున్న సంభాషణను వినొచ్చు. ఎయిర్‌చాట్ యాప్ ఆడియో/ వీడియో చాట్‌కు మాత్రమే పరిమితం కాకుండా టెక్ట్స్ ఆధారిత చాట్‌రూంలను కూడా కలిగి ఉంటుంది.
ఎయిర్‌చాట్ యాప్ ప్రస్తుతం iOS బీటా టెస్టింగ్‌లో ఉంది. ఆసక్తి ఉన్న వారు http://www.getairchat.com/ వెబ్‌సైట్ ద్వారా చేరవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం ఫోన్ నంబర్ మరియు ట్విట్టర్ ఖాతాను వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పంపించిన అభ్యర్థనను ఎయిర్‌చాట్ బృందం సమీక్షించి. ఓ కోడ్‌ను పంపుతుంది. ఆ కోడ్‌తో ఎయిర్‌చాట్ బీటా వెర్షన్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








