జపానోళ్లు గ్రేట్ గురూ!

Posted By:

తినే సమయంలో ఒంటరితనాన్ని ఎదుర్కొనే వారి కోసం ‘యాంటీ లోన్లీనెస్ రామెన్ బౌల్' సిద్ధమైంది. ఈ రామెన్ బౌల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్లాట్ స్మార్ట్‌ఫోన్‌ను తనలో సరిగ్గా ఫిట్ చేసుకుంటుంది. దింతో వేడివేడి రామెన్ తింటూ ఎదురుగా ఉన్నస్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో ఛాటింగ్, టెక్స్టింగ్ ఇంకా ఆడియో, వీడియో మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

ఇలా చేయటం వల్ల తినే సమయంలో ఒంటరిగా ఉన్నామన్న బాధ నుంచి ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒత్తిడిని దూరం చేసే యాంటీ లోన్లీనెస్ రామెన్ బౌల్‌ను అమెరికన్ డిజైనర్ మిన్నీజా ఇంకా జపనీస్ డిజైన్ డైసూక్ నాగాటమోలు సంయుక్తంగా డిజైన్ చేశారు. ఈ ప్రత్యేక బౌల్స్‌ను ఇంకా మార్కెట్లోకి రాలేదు. వీటిని త్వరలోనే నోవల్టీ స్టోర్‌లలో విక్రయించనున్నారు.

జపానోళ్లు గ్రేట్ గురూ!

కొరుక్కుతినే ఐఫోన్ కవర్!

టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఓ వినూత్న తరహా ఆలోచనకు జపాన్ శ్రీకారం చుట్టింది. ‘తినదగిన ఐఫోన్ కవర్'ను డిజైన చేసి సరికొత్త ట్రెండ్‌కు జపనీయలు ప్రేరణగా నిలిచారు. వివరాల్లోకి వెళితే....... జపాన్‌కు చెందిన ఓ ఫ్రముఖ ఆన్‌లైన్ స్టోర్ ‘సర్వైవల్ సెన్ బాయ్ రైస్ క్రాకర్ ఐఫోన్ కేస్' (Survival Senbai Rice Cracker iPhone Case)ను $81కు ఆఫర్ చేస్తోంది. గోధుమ బియ్యం ఇంకా ఉప్పుతో తయారుకాబడిన ఈ కవర్ ఆకర్షణీయ ఐఫోన్ కేస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కవర్‌ను ఐఫోన్‌5కు రక్షణ కవచంలానే కాకుండా అత్యవసర సమయాల్లో ఆహరంగానూ ఉపయోగించుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot