భారత్‌లో 700 మందికి సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఉద్వాసన

Posted By: Staff

భారత్‌లో 700 మందికి సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఉద్వాసన

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఇంటర్‌నెట్ కంపెనీ ఎవోఎల్ భారతదేశంలో 700 మందికి ఉద్వాసన పలికింది. కంపెనీలో అమెరికాలో 200 మందికి, భారత్‌లో 700 మందిని తొలగించనున్నామని, వీరిలో 300 మంది ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తారని, కనుక మొత్తం మీద 400 నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనున్నామని ఎవోఎల్ సిఇవో టిమ్ ఆమ్‌స్ట్రాంగ్ ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.

కంపెనీలో మొత్తం 5 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఇటీవల కంపెనీ స్వాధీనం చేసుకున్న హఫింగ్‌టన్ పోస్టుకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ కంపెనీ స్వాధీనం తర్వాత ఎడిటోరియల్, జర్నలిజంపై నాణ్యమైన దృష్టి పెట్టేందుకు వీలుకలిగిందని ఆయన తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot