రూ.149కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఉచిత ఫోన్ కాల్స్

బ్రాడ్‌బ్యాండ్ కనెక్టువిటీ సేవలను తక్కువ రేట్లకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

రూ.149కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఉచిత ఫోన్ కాల్స్

ఏపీ ఫైబర్‌నెట్ పేరుతో లాంచ్ అయిన ఈ స్టేట్‌వైడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టుకు సిస్కో కంపెనీ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో AP FiberNet సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Read More : ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా

ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించబోతోన్న AP FiberNet సేవలు అత్యంత చౌక ధరకే స్మార్ట్ కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.

ఒకే కనెక్షన్ పై ఇంటర్నెట్, ఫోన్ ఇంకా కేబుల్ టీవీ ప్రసారాలు

ఏపీ ఫైబర్‌నెట్ అందించే సర్వీసులో భాగంగా ఒకే కనెక్షన్ పై ఇంటర్నెట్, ఫోన్ ఇంకా కేబుల్ టీవీ ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఈ సేవలకుగాను నెల మొత్తానికి స్టార్టర్ ప్యాకేజీ క్రింద రూ.149 చెల్లిస్తే సరిపోతుంది.

రెండు సెటప్ బాక్సులను సమకూర్చుకోవల్సి ఉంటుంది

ఏపీ ఫైబర్‌నెట్ కనెక్షన్‌ తీసుకువాలనుకునే వారి కోసం రెండు సెటప్ బాక్సులను సమకూర్చుకోవల్సి ఉంటుంది. అందులో ఒక బాక్సును ఇంటర్నెట్ అలానే పోన్ కనెక్షన్ నిమిత్తం ఉపయోగిస్తారు. ఈ బాక్సులోనే వై-ఫై సౌకర్యం కూడా ఉంటుంది. అంటే ఇంట్లోని అన్ని వై-ఫై గాడ్జెట్‌లను ఈ బాక్సుకు కనెక్ట్ చేసుకోవచ్చు.

రెండవ బాక్సును కేబుల్ టీవి ప్రసారాల నిమిత్తం

రెండవ బాక్సును కేబుల్ టీవి ప్రసారాల నిమిత్తం తీసుకోవల్సి ఉంటుంది. రెండు బాక్సులకు కలిపి రూ.4,100 వెచ్చించాల్సి ఉంటుంది. ఏపీ ఫైబర్ తో ఒప్పందం కుదుర్చుకునే స్థానిక కేబుల్ ఆపరేటర్ నుంచి ఈ బాక్సులను కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

మంత్లీ స్టార్టర్ ప్యాకేజీలో భాగంగా

ఏపీ ఫైబర్‌నెట్ అందించే రూ.149 మంత్లీ స్టార్టర్ ప్యాకేజీలో భాగంగా ఇంటర్నెట్ వేగం మొదటి 5జీబి వరకు 15 ఎంబీపీఎస్ ఉంటుంది.

5జీబి లిమిట్‌ను దాటిన తరువాత

5జీబి లిమిట్‌ను దాటిన తరువాత 512 కేబీపీఎస్‌కు పడిపోతోంది. ఫోన్ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితం.

వివిధ ప్యాకేజీలలో

ఏపీ ఫైబర్‌నెట్ ఇంటర్నెట్ సేవలను 25జీబి, 50జీబి, 100జీబి తరహా ప్యాకేజీలలో అందిస్తోంది.

150 వరకు ఉచిత టీవీ ఛానల్స్ ఉచితం..

ఏపీ ఫైబర్‌నెట్ అందించే కేబుల్ టీవీ ప్రసారాల్లో భాగంగా 150 వరకు ఉచిత ఛానళ్లను ఆస్వాదించవచ్చు. పే ఛానల్స్ నిమిత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
AP FiberNet for just RS 149 With 15Mbps Broadband. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting