AP FiberNet ఉత్తమ ప్లాన్‌లు, డేటా స్పీడ్, ధరల వివరాలు తనిఖీ చేయండి

|

COVID-19 కారణంగా చాలా మంది వారి యొక్క ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారు పట్టణాలలో ఉండకుండా తమ యొక్క సొంత గ్రామాలలో ఉండి పనిచేస్తున్నారు. ఇప్పటికి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లను ఇస్తున్నాయి. గత రెండేళ్లలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు డిమాండ్ బాగానే పెరిగింది. మనలో చాలా మందికి Airtel బ్రాడ్‌బ్యాండ్, ACT ఫైబర్‌నెట్ మరియు BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు బాగా తెలుసు. అయితే ఇవి అన్ని ప్రాంతాలలోను అందుబాటులో లేవు.

 

AP FiberNet

ఉదాహరణకు పల్లె ప్రాంతాలలో ప్రైవేట్ సంస్థలు తమ యొక్క సేవలను అందించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే AP ఫైబర్ నెట్ సరసమైన ధర పరిధిలో ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటుగా సర్వీస్ టీవీ ఛానెల్లను కూడా అందిస్తున్నాయి. ఈ కథనంలో మేము AP FiberNet అందించే ప్లాన్‌లు, ఆఫర్‌లు, స్పీడ్ మొదలైనవన్నీ చర్చించాము. వీటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

AP FiberNet వివరాలు

AP FiberNet వివరాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లేదా AP ఫైబర్ అనేది మొదటగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2015లో ప్రారంభించారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది సిస్కో సిస్టమ్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. AP ఫైబర్ గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడం మరియు ఆంధ్రప్రదేశ్‌లో సరసమైన ఎండ్-టు-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ సౌకర్యం, కేబుల్ టెలివిజన్ మరియు ఫోన్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 13 నగరాల్లో సేవలను అందిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని 3,000 పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు తన యొక్క నెట్‌వర్క్‌ సేవలను అనుసంధానించబడి ఉన్నాయి. AP FiberNet గృహాలు మరియు ప్రైవేట్ కార్యాలయాలు రెండింటికీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది.

AP ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్
 

AP ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా కేవలం రూ.350 (GSTతో సహా) ధరతో ప్రారంభమవుతాయి అధికంగా వీటి ధరలు రూ.2,499 (GST మినహా) వరకు ఉంటాయి. ఇంటి వద్ద ఉండే వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో టెలివిజన్ ఛానెల్‌లు కూడా ఉన్నాయి. కంపెనీ ట్రిపుల్ ప్లే పథకం విభాగంలో అందిస్తున్నందున టీవీ యొక్క ఛానల్ తో పాటుగా ఇంటర్నెట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు కావున తమ ఫోన్ లను రీఛార్జ్ చేసినప్పుడు OTT ప్రయోజనాలతో లభించే ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే కనుక అమెజాన్, హాట్ స్టార్, Zee5, సన్ నెక్స్ట్ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. తద్వారా AP ఫైబర్ అందించే అపరిమిత ఇంటర్నెట్ సహాయంతో అద్భుతమైన సేవలను పొందవచ్చు. అయితే AP ఫైబర్ అందించే ఏ ప్లాన్‌లు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

AP ఫైబర్ డొమెస్టిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

AP ఫైబర్ డొమెస్టిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

AP ఫైబర్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు కేవలం రూ.350తో ప్రారంభమవుతాయి. రూ.350 ధర వద్ద లభించే బేసిక్ ప్లాన్ వినియోగదారులకు ఒక నెల చెల్లుబాటు కాలానికి 200+ ఛానెల్‌లు, గరిష్టంగా 20 Mbps వేగంతో 150GB FUP పరిమిత డేటాను అందిస్తుంది. FUP డేటా తర్వాత ఇంటర్నెట్ బ్రౌసింగ్ కోసం స్పీడ్ 2 Mbps కు తగ్గించబడుతుంది. AP ఫైబర్ హోమ్ ఎసెన్షియల్ ప్లాన్ రూ.449 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ ఒక నెల చెల్లుబాటు కాలానికి 240+ ఛానెల్‌లు, 30 Mbps వేగంతో 300GB FUP డేటా అందిస్తుంది. FUP డేటా తర్వాత స్పీడ్ 2 Mbps తో అపరిమిత డేటాను అందిస్తుంది. చివరగా AP ఫైబర్ హోమ్ ప్రీమియం ప్లాన్ ఒకే నెల చెల్లుబాటు కాలానికి రూ.599 ధర వద్ద లభిస్తుంది. ఇది వినియోగదారులకు 245+ ఛానెల్‌లను మరియు 50Mbps వేగంతో ఎటువంటి పరిమితి లేకుండా అపరిమిత డేటాను బ్రాజ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఆఫీస్ కార్యాలయాల కోసం AP ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఆఫీస్ కార్యాలయాల కోసం AP ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

AP ఫైబర్ సంస్థలు మరియు ప్రైవేట్ కార్యాలయాల కోసం కూడా ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తున్నది. AP ఫైబర్ ఎంటర్‌ప్రైజ్ పేరుతో లభించే బేసిక్ ప్లాన్ రూ.999 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. ఇది వినియోగదారులకు 100 Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. రెండవ ప్లాన్ AP ఫైబర్ ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్ ప్యాక్ రూ.1,499 ధర వద్ద మరియు ఎంటర్‌ప్రైజ్ ప్రీమియం ప్లాన్ రూ. 2,499 ధర వద్ద 100 Mbps వేగంతో వరుసగా 800GB, 2000GB డేటాను ఒక నెల చెల్లుబాటు కాలంలో లభిస్తుంది. సంస్థలు లేదా ప్రైవేట్ కార్యాలయాల కోసం AP ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం పూర్తి టేబుల్‌ను ఇక్కడ తనిఖీ చేయండి.

FiberNet

1. AP ఫైబర్ కోసం ఏ ప్లాన్ ఉత్తమం?

మీరు మీ ఇంటికి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే రూ. 599 ధర వద్ద లభించే AP ఫైబర్ హోమ్ ప్రీమియం ప్లాన్ ను ఎంచుకోవచ్చు. దీనితో మీరు 50 Mbps వేగంతో అపరిమిత FUP పరిమితిని పొందుతారు. ఆఫీస్ సంస్థల కోసం AP ఫైబర్ ప్రీమియం ప్లాన్ (ధర రూ. 2,499) మంచి ప్లాన్ కావచ్చు.


2. AP FiberNet కస్టమర్ కేర్/టోల్-ఫ్రీ నంబర్ ఏమిటి?

AP ఫైబర్ కస్టమర్ కేర్ లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800 599 5555

3. AP FiberNet అపరిమిత డేటాను అందిస్తుందా?

అవును, మీరు అపరిమిత ప్లాన్‌లతో సహా అనేక AP FiberNet ప్లాన్‌లను పొందుతారు.

4. AP ఫైబర్ నెట్ అనేది బ్రాడ్‌బ్యాండా?

అవును, AP FiberNet ఒక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్.

5. AP FiberNetతో కొత్త కనెక్షన్ ధర ఎంత?

AP FiberNet డొమెస్టిక్ ప్లాన్ ప్రారంభ ధర రూ.350.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
AP FiberNet Provide Best Broadband Plans: Price, Speed And More Details are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X