రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!

Written By:

బ్రాడ్ బ్యాండ్ కనెక్టువిటీ సేవలను తక్కువ రేట్లకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి ఫేజ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్టణంలో ప్రారంభించారు.

రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!

Read More : షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు

ఏపీ ఫైబర్‌నెట్ పేరుతో లాంచ్ అయిన ఈ స్టేట్‌వైడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టుకు సిస్కో కంపెనీ సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో కంపెనీలు అవగాహన ఒప్పందాల పై సంతకాలు చేసాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నేటి డిజిటల్ యుగంలో భాగంగా ప్రజలను ముందుకు నడిపించే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తక్కువ రేటుకే ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించేందుకు ఈ కార్యక్రమానికి చేపట్టామని అన్నారు.

రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!

Read More : మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయటం లేదా..?

డిజిటల్ ఇండియా స్పూర్తితో జరుగుతోన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏప్రిల్ నాటికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్‌లను అందించటం జరుగుతుంది. మిగిలిన జిల్లాలో జూలై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.

రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!

Read More : గూగుల్ కంపెనీలో భోజనం ఎలా ఉంటుంది..?

ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా 15ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ను కేవలం రూ.149కే అందిస్తారు. 100 ఎంబీపీఎస్ కనెక్షన్‌ను రూ.999కే పొందవచ్చు. విద్యుత స్తంభాల ద్వారా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting