Home
News

యాప్ తో, పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పెట్టిన పోలీసులు! మీరూ కంప్లైంట్ చేయండి!

By Maheswara

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ యొక్క అవసరం ప్రతి చోట ఉంది. కొందరు తమ యొక్క అవసరాల కోసం రెండు స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఉపయోగిస్తుంటారు. వినియోగదారులు తమ యొక్క స్మార్ట్‌ఫోన్‌లలో ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరుస్తూ ఉంటారు. ఇంత ముఖ్యమైన స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే అటువంటి స్మార్ట్‌ఫోన్‌ను మీరు పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మీకు తెలుసు. కనుక దానిని తిరిగి పొందడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. గత రెండు సంవత్సరాలలో టెక్నాలజీ మెరుగ్గా ఉండడంతో పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడానికి సులభతరమైన మార్గాలు చాలానే ఉన్నాయి.

AP Police Of Kurnool District Using A Special App To Recover Lost Mobile Phones Of People. Know Full Details.

పోగొట్టుకున్న ఫోన్ గురించి పోలీస్ ఫిర్యాదు ఇచ్చినా కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో పోలీస్ లు మీ ఫోన్ ను కనుగొని మీకు అప్పగించగలరు. అలాంటి, ఒక స్పెషల్ యాప్ తో ఇప్పటివరకు కొన్ని వేల ఫోన్లను రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించిన కర్నూల్ పోలీస్ ల యొక్క ఆపరేషన్ ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నెల రోజుల క్రితం తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌ తోమర్‌ తన ఫోన్ పోగొట్టుకున్నట్లు కర్నూల్ పోలీసు యాప్‌లో ఫిర్యాదు చేయడంతో దానిని తిరిగి పొందారు. అలాగే "వివిధ రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చే చాలా మంది ప్రజలు తమ పోగొట్టుకున్న ఫోన్‌లను యాప్ సహాయంతో తిరిగి పొందడం ఆనందంగా ఉంది" అని ఇక్కడ పోలీసులు తెలిపారు.

AP Police Of Kurnool District Using A Special App To Recover Lost Mobile Phones Of People. Know Full Details.

ఏపీ సరిహద్దుల్లోని టోల్‌ప్లాజా వద్ద ఫోన్‌ పోగొట్టుకున్న హైదరాబాద్‌కు చెందిన మహిళకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కర్నూలు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆమె దానిని తిరిగి పొందారు.మీరు కూడా మొబైల్ పోగొట్టుకున్నట్లైయితే ఫిర్యాదు చేయడం ద్వారా పొందే అవకాశం ఉంది.

ఆదివారం కర్నూలులో 4వ విడత ఫోన్ రికవరీ మేళాను కర్నూలు ఎస్పీ సిద్దార్థకౌసెల్ నిర్వహించారు. పోగొట్టుకున్న 1,924 మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ రికవరీ మేళా యొక్క నాలుగు దశల్లో మొత్తం 5727 మొబైల్ ఫోన్లను భారీ సంఖ్యలో రికవరీ చేసినట్లు తెలిపారు.ఈ మేళా యొక్క మొదటి దశలో 653 మొబైల్ ఫోన్లు, రెండో దశలో 1064, మూడో దశలో 2086 మొబైల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు.

"ప్రస్తుత మేళాలో, మేము మరిన్ని మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నాము మరియు వాటిని కోల్పోయిన వారికి అందజేస్తాము."అని తెలిపారు. "మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసే మా సిస్టమ్ చాలా రాష్ట్రాలకు విస్తరించింది", ఇతర రాష్ట్రాల నుండి కూడా కనీసం 700 మొబైల్ ఫోన్‌లను గుర్తించి వాటి అసలు యజమానులకు అప్పగించినట్లు ఎస్‌పి తెలిపారు.

సాధారణంగా ప్రజలు తమ ఫోన్లను పోగొట్టుకుంటే అలాగే వదిలివేస్తుంటారు. లేదా వాటికి ఫోన్ చేయడం ద్వారా తిరిగి పొందాలని ప్రయత్నిస్తారు. కానీ, మీరు ఫోన్ పోగొట్టుకుంటే మొదట అన్నింటికంటే ముఖ్యమైన పని దొగలించినబడిన లేదా పారేసుకున్న మీ ఫోన్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇవ్వండి.

Best Mobiles in India

English summary
AP Police Of Kurnool District Using A Special App To Recover Lost Mobile Phones Of People. Know Full Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X