అపోలో11స్పేస్ మిషన్:50సంవత్సరాల సందర్భంగా "మూన్ ల్యాండింగ్ వీడియోను" రిలీజ్ చేసిన గూగుల్

|

యాభై సంవత్సరాల క్రితం జూలై 21 న నాసా తన అద్భుతమైన అపోలో 11 మిషన్‌తో చరిత్ర సృష్టించింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన మొట్టమొదటి మానవుడు. ఈ ఘనత సాదించడానికి వెనుక 400,000 మందికి పైగా కలిసి పనిచేసిన కృషి ఉంది. అపోలో 11 రాకెట్ జూలై 16, 1969 న భూమి నుండి బయలుదేరి జూలై 24, 1969 న తిరిగి వచ్చింది.

apollo 11 space mission 50th anniversary moon landing nasa google doodle michael collins

ఈ అపోలో 11 మిషన్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ మరియు మైఖేల్ కాలిన్స్ మొత్తం ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు . చంద్రుని పైకి ప్రయోగించిన మొట్ట మొదటి విజయవంతమైన మిషన్ గా పేరు సంపాదించి అందరి ప్రశంసలను పొందింది. అంతేకాకుండా ఇది చరిత్రలో చెక్కబడిన ఒక స్మారక క్షణంగా సృష్టించారు.

apollo 11 space mission 50th anniversary moon landing nasa google doodle michael collins

ఈ స్మారక రోజు సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు గూగుల్ సంస్థ గూగుల్ డూడుల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అప్పటి వ్యోమగాములలో ఒకరైన మైఖేల్ కాలిన్స్ మొత్తం అంతరిక్ష కార్యకలాపాలను వివరించాడు.

గూగుల్ డూడుల్ వీడియో:

గూగుల్ డూడుల్ వీడియో:

సెర్చ్ దిగ్గజం హోమ్‌పేజీలోని గూగుల్ డూడుల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రునిపై అడుగు పెట్టినట్లు చూపించింది. ముగ్గురు వ్యోమగాములు ఈ ప్రయాణంలో ఒక భాగం అయితే ఆర్మ్‌స్ట్రాంగ్ మాత్రమే గొప్ప కీర్తి వచ్చింది. ఎందుకంటే అతను చంద్రునిపై అడుగుపెట్టిన మొట్ట మొదటి మనిషి కావున. మీరు డూడుల్‌పై క్లిక్ చేసినప్పుడు ఇది అంతరిక్ష ప్రయాణాన్ని వివరించే YouTube వీడియోను పాప్-అప్ చేస్తుంది.

యానిమేటెడ్ షార్ట్ వీడియో:

యానిమేటెడ్ షార్ట్ వీడియో:

యానిమేటెడ్ షార్ట్ క్లిప్ వీడియోలో అపోలో11 సాటిలైట్ భూమి నుండి ఎలా టేకాఫ్ అవుతుందని చూపిస్తుంది. ఇదే కాకుండా మొత్తం ప్రయాణాన్ని భూమి నుండి చంద్రుని వద్దకు వెళ్లడం మరియు మళ్ళీ వెనుకకు తిరిగి రావడం వీడియో కొల్లిన్ వాయిస్ తో వివరించింది.ఈ వీడియోలో ముగ్గురు వ్యోమగాములు ఈ ఘనతను ఎలా సాధించగలిగారు, వారు చంద్రుడిని మొదటిసారి దగ్గర నుండి చూసినప్పుడు వారి భావోద్వేగాలు మరియు చంద్రుడి ఉపరితలం నుండి భూమి ఎలా ఉందో వంటి వివరాలు వివరించాడు. ఈ ముగ్గురూ వ్యోమగాములు జూలై 24 న తిరిగి భూమిపైకి వచ్చారు తరువాత వారి విజయాన్ని పురస్కరించుకునేందుకు ప్రపంచ పర్యటనకు వెళ్లారని ఆయన చెప్పారు. అతను తన కథను ముగించే ముందు మీరు మరియు నేను ఈ అద్భుతమైన భూమి యొక్క నివాసులు మేము దీన్ని చేసాము మీరు కూడా ఈ పూర్తి వీడియోను చూడండి అని తెలిపారు.

అపోలోయిన్ రియల్‌టైమ్.ఆర్గ్‌:

అపోలోయిన్ రియల్‌టైమ్.ఆర్గ్‌:

ఇది కాకుండా ఫిస్ట్ మరియు ఆర్కివిస్ట్ స్టీఫెన్ స్లేటర్ కూడా అపోలో 11 మిషన్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉన్న ఒక వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు ఆరోగ్యకరమైన అనుభవాన్ని అందించడానికి మరియు సమయానికి తిరిగి వెళ్లడానికి ఉన్న అన్ని ఆడియో, ఫొటోస్ , వీడియో మరియు ట్రాన్స్‌క్రిప్ట్‌లు ఉన్నాయి. మల్టీమీడియా ట్రీట్‌ను అనుభవించడానికి మీరు అపోలోయిన్ రియల్‌టైమ్.ఆర్గ్‌ను సందర్శించవచ్చు.

 నాసా టీవీ షోలు:

నాసా టీవీ షోలు:

నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం జూలై 20న వాషింగ్టన్ మాన్యుమెంట్‌లో ‘గో ఫర్ ది మూన్' షోను ప్రదర్శిస్తోంది. నాసా కూడా ప్రత్యేక షోలను నిర్వహిస్తోంది. దానిని నాసా టీవీలో జూలై 20న ప్రసారం చేస్తుంది.


గుర్తుచేసుకుంటే అపోలో 11 రాకెట్ జూలై 16, 1969 న భూమి నుండి బయలుదేరి జూలై 19 న చంద్ర కక్ష్యకు చేరుకుంది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ జూలై 21 న చంద్రునిపైకి దిగారు. జూలై 21 న చంద్రుని నుండి బయలుదేరి చంద్ర కక్ష్యను జూలై 22 న దాటి తన ప్రయాణాన్ని కొనసాగించింది మరియు జూలై 24 న భూమిపైకి సురక్షితంగా చేరుకున్నది.

 

Best Mobiles in India

English summary
apollo 11 space mission 50th anniversary moon landing nasa google doodle michael collins

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X