Airtel యూజర్లకు ఉచితంగా అపోలో సర్కిల్ సేవలు!! కాకపోతే వీరికి మాత్రమే...

|

ప్రస్తుత కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరికీ ఆరోగ్య సంరక్షణను సురక్షితంగా మరియు త్వరగా అందించే ప్రయత్నంలో భాగంగా భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ అపోలో 24/7 తో కొత్తగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ టెల్కో తన యొక్క ఎయిర్టెల్ థాంక్స్ ప్రోగ్రాం కింద వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. వివరాలలోకి వెళితే ఎయిర్టెల్ థాంక్స్ యూజర్లు అపోలో 24/7 కి కనెక్ట్ చేయడం ద్వారా రోజులో ఎప్పుడైనా ఆరోగ్య సేవలను పొందగలుగుతారు. ఎయిర్టెల్ థాంక్స్ గోల్డ్ మరియు ప్లాటినం చందాదారులు అపోలో సర్కిల్‌కు కాంప్లిమెంటరీ చందా పొందుతారు. భారతదేశ ప్రజలకు ఎలక్ట్రానిక్ పరికరాలతో ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడానికి అపోలో గ్రూప్ ఇటీవల 'అపోలో సర్కిల్' ను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ తో ఎయిర్‌టెల్ యూజర్లు పొందే ప్రయోజనాలు

అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ తో ఎయిర్‌టెల్ యూజర్లు పొందే ప్రయోజనాలు

అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌కు అర్హత ఉంటే వినియోగదారులు ప్రధానంగా నాలుగు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో మొదటిది 'ఆన్‌లైన్ కన్సల్టేషన్'. దీనితో వినియోగదారులు తమ ఇళ్ల వద్దనే కూర్చొని దేశంలోని అగ్రశ్రేణి వైద్యులను సులభంగా సంప్రదించవచ్చు. రెండవది 'డయాగ్నోస్టిక్స్' దీనితో వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక పరీక్షను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం కంపెనీ వినియోగదారుల ఇంటివద్దనే పరీక్షకు కావలసిన నమూనాను సేకరించడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. మూడవది 'ఫార్మసీ' మరియు 'వెల్నెస్' ప్రయోజనాలు కూడా అదనంగా ఉన్నాయి.

వెల్నెస్

ఫార్మసీ ప్రయోజనంతో వినియోగదారులు వైద్యులు సూచించిన మరియు వారికి అవసరమైన ఔషధాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే వెల్నెస్ ప్రయోజనంతో వినియోగదారులకు కావలసిన సమాచారాన్ని వెల్నెస్ ఆధారంగా వివిధ రకాల ఆన్‌లైన్ కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు అన్ని కూడా ఎయిర్టెల్ థాంక్స్ ప్లాటినం కస్టమర్లు అపోలో సర్కిల్‌ యొక్క 12 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ తో పొందవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ థాంక్స్ గోల్డ్ కస్టమర్లు 3 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ తో పొందుతారు.

ఎయిర్టెల్ వినియోగదారులు అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ ను యాక్టివేట్ చేసే విధానం
 

ఎయిర్టెల్ వినియోగదారులు అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ ను యాక్టివేట్ చేసే విధానం

'ఎయిర్‌టెల్ థాంక్స్' అప్లికేషన్‌ను ఓపెన్ చేయడం ద్వారా అపోలో సర్కిల్ సబ్స్క్రిప్షన్ ను సులభంగా యాక్టివేట్ చేయవచ్చు. ఇందుకోసం మొదట 'డిస్కవర్ థాంక్స్' విభాగానికి వెళ్లండి. ఈ విభాగం కింద 'అపోలో సర్కిల్' ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. దీనిలో వినియోగదారులు ఉచిత ట్రయల్ ను ప్రారంభించడాన్ని కూడా ఎంచుకోవచ్చు. తరువాత వినియోగదారులను 'తప్పనిసరి' సమాచారాన్ని నమోదు చేయమని అడుగుతారు. ఆ తర్వాత వారు నిర్ధారణ పేజీకి మళ్ళించబడతారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు అపోలో 24/7 మొబైల్ యాప్ కి మళ్ళించబడతారు.

Best Mobiles in India

English summary
Apollo Circle Membership Now Free For Airtel Platinum and Gold Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X