మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్న అపోలో ఆస్పత్రులు

Posted By: Staff

మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్న అపోలో ఆస్పత్రులు

న్యూఢిల్లీ : హెల్త్‌కేర్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న అపోలో ఆస్పత్రులు మెడికల్‌ కాలేజీల విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా మూడు ప్రాంతా లను చెనై్న, హైదరాబాద్‌, మదురై ప్రాంతాలను ఎంపిక చేసింది. అపోలో ఆస్పత్రుల చైన్‌ ప్రస్తుతం 11 నర్సింగ్‌ కాలేజీలను నిర్వహిస్తంది. వచ్చే రెండేళ్లలో మొత్తం మూడు కాలేజీలను ప్రారంభించబోతోంది. దీనికి కావా ల్సిన మాస్టర్‌ ప్లాన్‌ను కూడా తయారు చేసింది. చెనై్న, హైదరాబాద్‌, మదు రై ప్రాంతాల్లో కాలేజీల ఏర్పాటుకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతులు మంజూరైనట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ సంగీతా రెడ్డి చెప్పారు. వచ్చే రెండేళ్లలో మొత్తం మూడు కాలేజీల్లో ఒకటి మాత్రం తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పారు.

అయితే దీనికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. మెడికల్‌ కాలేజీల కోసం నిధుల సేకరించేందుకు కంపెనీ క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సేకరించనున్నట్లు తెలుస్తుంది. మలేషియాకు చెందిన ఖజానా సావరిన్‌ ఫండ్‌ అపోలో ఆస్పత్రుల్లో భాగస్వామిగా చేరుతుందా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. అపోలో ఆస్పత్రులు తమ హెల్త్‌కేర్‌ ఎడ్యూకేషన్‌కు ఖాజానాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అపోలో ఆప్పత్రులు ఖజానాకు 12 శాతం వాటా ఉంది. చెనై్న ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న అపోలో ఆస్పత్రుల చైన్‌ ప్రస్తుతం 11 నర్సింగ్‌, ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌ కాలేజీలను నిర్వహిస్తోంది. 1,200 ఫార్మసీలు, 8,500 పడకలు గల 54 ఆస్పత్రులు నిర్వహిస్తోంది. తమ సంస్థ సుమారు 5,000 మందికి ప్రతి సంవత్సరం పారా మెడికల్‌ శిక్షణ ఇస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 100 డయాగ్నోస్టిక్‌ సెంటర్లను నిర్వహిస్తోందని ఆమె అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot