అపోలో ఆస్పత్రిలో 'ఐపాడ్‌ నావిగేషన్‌'తో శస్త్రచికిత్స చేసిన వైద్యులు

Posted By: Super

అపోలో ఆస్పత్రిలో 'ఐపాడ్‌ నావిగేషన్‌'తో శస్త్రచికిత్స చేసిన వైద్యులు

చెన్నై అపోలో ఆస్పత్రిలో 'ఐపాడ్‌ నావిగేషన్‌' పరికరం సాయంతో తుంటి ఎముక, మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆస్పత్రి ఆర్థో విభాగం సీనియర్‌ సర్జన్‌ డాక్టర్‌ విజయ్‌బోస్‌ గురువారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఎలక్ట్రానిక్‌ ఐపాడ్‌ పరికరం వైద్యులకు మరింత వెసులుబాటుగా కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న నావిగేషన్‌ విధానంలో తెరపై రోగి పరిస్థితిని చూస్తూ తదనుగుణంగా శస్త్రచికిత్సతో కృత్రిమ కీళ్లు అమర్చుతున్నారన్నారు. దేశంలో తొలిసారిగా ఐపాడ్‌ పరికరాన్ని అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిందని దీని సాయంతో అమెరికాకి చెందిన గైవిలియమ్స్‌(47), చెన్నైకి చెందిన మహిళ నిరంజన షా(65)లకు తుంటి, మోకాలి చిప్ప మార్పిడి చికిత్సలు నిర్వహించామని చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot