దొంగిలించిన ఫోన్‌తో సెల్ఫీ, అడ్డంగా దొరికిపోయిన దొంగ

Posted By:

 దొంగిలించిన ఫోన్‌తో సెల్ఫీ, అడ్డంగా దొరికిపోయిన దొంగ

స్మార్ట్‌గా వ్యవహరించి ఐఫోన్‌ను దొంగిలించిన ఓ దొంగ తన తెలివితక్కువ పనితో అడ్డంగా దొరికిపోయిన సంఘటన వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే...23 సంవత్సరాల రాలీ బింగ్‌హమ్ తన ఐఫోన్‌ను డెన్వర్ బార్‌లో పోగొట్టుకుంది.

అపహరించిన ఫోన్‌తో సదరు దొంగ దిగిన 30 సెల్ఫీలు రాలీ బింగ్‌హమ్ ఫేస్‌బుక్ ఫోల్డర్‌లో ప్రత్యక్షమవటంతో కథ కాస్తా కొత్త మలుపు తీసుకుంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మెట్రో డెన్వర్ క్రైమ్ స్టాపర్లు సెల్ఫీల్లో కనిపిస్తున్న అనుమానితురాలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించినట్లయితే 2000 డాలర్లను రివార్డ్‌గా అందిస్తామని ఓ ప్రకటనను జారీ చేసారు.

English summary
Apparent iPhone thief reveals face to world with selfie-shooting streak. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot