Home
News

ఆపిల్ నుంచి కొత్త ఎమోజీలు, 2020 టార్గెట్ ఇదే

By Gizbot Bureau

ఆపిల్ కంపెనీ కొత్త అప్ డేట్ రిలీజ్ చేసింది. యూజర్ల కోసం ఆపిల్ కీబోర్డులో కొత్త ఎమోజీలను ప్రవేశపెట్టింది. ఆపిల్ ప్రొడక్టుల్లో ఐఫోన్లు, ఐప్యాడ్స్, మ్యాక్స్, ఆపిల్ వాచ్ అన్నింటిల్లో మొత్తం 59 కొత్త ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. కీబోర్డుపై నచ్చిన ఎమోజీలోని స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకుని యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. 75కు పైగా ఎన్నో కాంబినేషన్ ఎమోజీలు యూజర్లకు కీబోర్డులో అందుబాటులో ఉన్నాయని ఐఫోన్ మేకర్ బ్లాగ్ పోస్టులో తెలిపింది.

Apple adding 59 new emojis to its keyboard

ఆపిల్ కీబోర్డుల్లో డిసేబుల్టీ థీమ్డ్ ఎమోజీలను కూడా ప్రవేశపెట్టింది. హియరింగ్ ఎయిడ్ ఈయర్, వీల్ చైర్స్, ప్రొస్తెటిక్ ఆర్మ్, ప్రొస్తెటిక్ లెగ్ ఎమోజీలు కూడా ఉన్నాయి. ఎమోజీ కీబోర్డులో ఈ కొత్త ఎంపికలు గణనీయమైన అంతరాన్ని ఫిల్ చేసేందుకు సాయపడుతాయి’ అని పోస్ట్ తెలిపింది. ఆపిల్ కీబోర్డులోకి ప్రవేశించే ఇతర కొత్త ఎమోజీలు ఆవలింతతో కూడిన కొత్త చిరునవ్వు ముఖం, స్విమ్ సూట్, కొత్త ఫుడ్ ఐటమ్స్, ఫలాఫెల్, వెన్న, వెల్లుల్లితో సహా కొత్త జంతువులు స్లాత్, ఫ్లెమింగో, ఒరంగుటాన్, ఉడుము వంటివి ఉన్నాయి. ఆపిల్ పరికరాల్లో ఉచిత సాఫ్ట్‌వేర్ అప్ డేట్ లో ఈ కొత్త ఎమోజీలు అందుబాటులో ఉండనున్నాయి. ఐ ఫోన్లలో 2020 నాటికి మరో అదనపు ఆకర్షణ రాబోతుంది. అదేంటో చూద్దాం.

ఐ ఫోన్లలో 2020 నాటికి మరో అదనపు ఆకర్షణ

ఐ ఫోన్లలో 2020 నాటికి మరో అదనపు ఆకర్షణ

అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఐ ఫోన్లలో 2020 నాటికి మరో అదనపు ఆకర్షణ రాబోతుందనే వార్తలు టెక్నాలజీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2020 నాటికి టైం ఆఫ్ ఫ్లైట్ (ToF) 3డీ సెన్సార్ కెమేరాను ఆపిల్ ఫోన్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు తెలుస్తోంది.

కెమెరా వ్యవస్థ
2019 చివరినాటికి ఈ తరహా కెమేరా వ్యవస్థను ఐ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని రూమర్లు వచ్చాయి. కానీ ఐఫోన్ వర్గాలు మాత్రం అది సాధ్యం కాదని, 2020 నాటికి కార్యరూపం దాల్చవచ్చని పేర్కొంటున్నాయి.

వర్టికల్ కేవిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ (VCSEL) టెక్నాలజీ

వర్టికల్ కేవిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ (VCSEL) టెక్నాలజీ

వర్టికల్ కేవిటీ సర్ఫేస్ ఎమిటింగ్ లేజర్ (VCSEL) టెక్నాలజీ కలిగిన కెమెరా 2020 కి రాబోయే ఐఫోన్లలో ఏర్పాటుచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈట్రూ డెప్త్ కెమేరాలో ఎన్నో విశిష్ట లక్షణాలుంటాయి. ఫేస్ ఐడీ, యానిమోజీ, పోర్ట్రైయిట్ మోడ్ సెల్ఫీలు తీసుకోవచ్చు.

టైం ఆఫ్ ప్లైట్ కెమెరా మోడ్

టైం ఆఫ్ ప్లైట్ కెమెరా మోడ్

ఐఫోన్ల కంటే ముందుగా ఐ ఫోన్ ఐపాడ్స్ లో ఈ తరహా కెమెరాను ముందుగా ఏర్పాటు చేయబోతున్నట్టు ఆపిల్ అనలిస్ట్ మింగ్ చి కు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి టైం ఆఫ్ ప్లైట్ కెమెరా మోడ్ అత్యాధునిక నాలుగు మోడల్స్ కలిగిన ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

సరికొత్తగా ఓఎల్ఇడీ స్క్రీన్లు

సరికొత్తగా ఓఎల్ఇడీ స్క్రీన్లు

5.4 అంగుళాలు, 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలు కలిగిన ఓఎల్ఇడీ స్క్రీన్లు కలిగిన ఫోన్లు రానున్నాయి. ఈ ఫోన్లన్నీ 5 జీ కనెక్టివిటీ సదుపాయం కలిగి ఉంటాయని తెలుస్తోంది. 5 జీ సదుపాయం లేని ఐఫోన్ 8 మోడల్ తరహాలోనే ఇవి వుంటాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple adding 59 new emojis to its keyboard
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X