'ఆపిల్ న్యూ ఐప్యాడ్‌'లో సరిక్రొత్త సమస్య...!

Posted By: Super

'ఆపిల్ న్యూ ఐప్యాడ్‌'లో సరిక్రొత్త సమస్య...!

 

గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడెప్పుడు విడదలవుతుందా అని ఎదురు చూసిన ఆపిల్ న్యూ ఐప్యాడ్ మార్కెట్లోకి వచ్చి రాగానే యూజర్స్ అందులో ఉన్న సమస్యను వెతకడం ప్రారంభించారు. ఏదిఐతేనేం ఎట్టకేలకు ఆపిల్ న్యూ ఐప్యాడ్ లో వినియోగదారులు ఓ సరిక్రొత్త సమస్యను కనిపెట్టారు. ఇంతకీ ఏమిటా ఆ సమస్య అని అనుకుంటున్నారా....?

కొత్త ఐప్యాడ్‌లో తీవ్రతాపన(overheating) ఉందని కనుగొనబడింది. గతంలో చూసినట్లైతే ఆపిల్ విడుదల చేసిన ఉత్పత్తులకు మొదటి సారే యజమానులు నుండి ప్రతికూల స్పందన వచ్చేది. కానీ ఐఫోన్ 4లో యాంటెనా సమస్య, ఐఫోన్ 4ఎస్‌ విడుదలైనప్పుడు ఐవోఎస్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌లో బ్యాటరీ సమస్య ఉందని వినియోగదారులు గుర్తించారు.

సరిగ్గా ఇప్పుడు ఆపిల్ న్యూ ఐప్యాడ్ విడుదలైన తర్వాత అందులో  తీవ్రతాపన(overheating) ఉందని యూజర్స్ తేల్చేశారు. ఆపిల్ న్యూ ఐప్యాడ్ ని కొనుగోలు చేసిన కస్టమర్స్ మాట్లాడుతూ టాబ్లెట్ ఎడమ వైపు తీవ్రతాపన(overheating) ఉందని ఓ ప్రముఖ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. వినియోగదారుల ఈ సమస్యను చూపడంతో ఆపిల్ ఎదుర్కుంటామని నివేదించింది.

అంతే కాకుండా  తీవ్రతాపన(overheating) రావడానికి గల కారణాలను తెలిపింది. ఆపిల్ న్యూ ఐప్యాడ్ స్క్రీన్ రిజల్యూషన్ 2048 x 1536 పిక్సల్స్‌గా ఉండడం.. క్వాడ్ కోర్ సిపియు అని తేల్చేసింది. ఐతే ఆపిల్ ప్రతినిధులు మాత్రం దీనిని కొట్టిపారేశారు. గత రెండు వారాల నుండి మేము న్యూ ఐప్యాడ్లను వినియోగిస్తున్నామని.. వై - పైతో పాటు 4జీ ఎల్‌టిఈ సపోర్ట్ చేస్తూ బ్యాటరీ 10 గంటలు పాటు వస్తుందని తెలిపారు.

ఆపిల్ ‘న్యూ ఐప్యాడ్’ వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot