బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఎయిర్‌పాడ్స్.. సేల్ వివరాలు..!
ఆపిల్‌కు చెందిన నాలుగు రకాల ఎయిర్‌పాడ్స్ (Apple Airpods Discount Price) ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అవి ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్, ఎయిర్‌పాడ్స్ 3 జనరేషన్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2 జనరేషన్ మరియు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలంటే ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ ను ఎంచుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్‌ను (Apple Airpods 2nd Generation) ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ఆఫర్లతో సంబంధం లేకుండా డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ ఫీచర్లు, ధర వివరాలతో పూర్తి కథనం.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ సాధారణ ధర రూ.12,900 గా ఉంది. అయితే ఈ ఎయిర్‌పాడ్స్ రూ.4,826 ఫ్లాట్ డిస్కౌంట్ పొందాయి. ఫలితంగా వీటి ధర ప్రస్తుతం రూ.8,074 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో ఈ ఎయిర్‌పాడ్స్‌పైన బ్యాంకు కార్డుల ద్వారా ఎటువంటి డిస్కౌంట్ లేదని తెలుస్తోంది.
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ సెన్సార్లు : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ డ్యూయల్ బీమ్, ఫార్మింగ్ మైక్రో ఫోన్లు, డ్యూయల్ ఆప్టికల్ సెన్సార్లు, మోషన్ డిటెక్టింగ్ యాక్సిలిరోమీటర్, స్పీచ్ డిటెక్టింగ్ యాక్సిలిరోమీటర్ వంటి సెన్సార్లను కలిగి ఉంది. మరియు H1 హెడ్‌ఫోన్ చిప్‌ను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ ఎయిర్‌పాడ్స్ అనేక కంట్రోల్స్‌ను కలిగి ఉంటాయి. డబుల్ ట్యాప్ టు ప్లే, ఫోన్‌ను నేరుగా ఆన్సర్ చేసేందుకు మరియు హే సిరి (Hey Siri) వంటి కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌పాడ్స్ ఛార్జింగ్ కోసం లైటినింగ్ పోర్టుతో వస్తుంది. మరియు బ్లూటూత్ 5.0 వైర్‌లెస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల పాటు ప్లేటైం : బ్యాటరీ మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్.. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 5 గంటలపాటు ప్లేటైం లేదా 3 గంటల వరకు ఫోన్‌కాల్ మాట్లాడుకోవచ్చు. అదే ఛార్జింగ్ కేస్‌తో 24 గంటల పాటు ప్లేటైం లేదా 18 గంటలపాటు కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఏయే OSలకు సపోర్టు చేస్తుందంటే : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 2 జనరేషన్ iOS కొత్త వెర్షన్ ఐఫోన్, ఐప్యాడ్ మోడళ్లు మరియు iPadOS కొత్త వెర్షన్ ఐప్యాడ్ మోడళ్లు మరియు MacOS మోడళ్లకు సపోర్టు చేస్తుంది. కొత్త వెర్షన్ tvOS కలిగిన ఆపిల్ టీవీలను సపోర్టు చేస్తుంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందనేది వెల్లడి కాలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







