Apple AirPods మింగేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఏ ఉత్పత్తి అయినా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరో టెస్ట్ లోనూ ఆపిల్ ఉత్పత్తి విజయవంతంగా పాస్ అయింది.

|

ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఏ ఉత్పత్తి అయినా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరో టెస్ట్ లోనూ ఆపిల్ ఉత్పత్తి విజయవంతంగా పాస్ అయింది. అయతే ఈ ప్రయోగాన్ని ఎవరూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయవద్దని డాక్టర్లు. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రయోగం ఏంటంటే తైవాన్ కె చెందిన ఓ వ్యక్తి Apple AirPodsని నిద్రపోతున్న సమయంలో మింగేశాడు. అది తనకు తెలియకుండానే జరిగింది. ఉదయం లేచిన తర్వాత తను ఒక Apple AirPod మింగానని తెలుసుకున్నాడు. అయితే అది మింగడం వల్ల తనకు ఏీ కాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

Apple AirPods మింగేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే ?

తైవాన్ లో..

తైవాన్ లోని కాయోహ్సుంగ్ పోర్ట్ నౌకాదళంలో పనిచేస్తున్న నౌకాదళ నియామకుడు Ben Hsu ఆపిల్ ఎయిర్‌పోడ్స్ లో పాటలు వింటూ రాత్రి నిద్రపోయాడు. అయితే తెల్లారి లేచి చూసేసరికి ఓ ఎయిర్‌పోడ్ కనిపించలేదు. వెతికి చూస్తే అది మింగేసానని తెలుసుకున్నాడు.

డాక్టర్ దగ్గరకు...

డాక్టర్ దగ్గరకు...

విషయం తెలిసి కంగారుగా డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. డాక్టర్ అతనిని పరీక్షించి నిజంగానే ఎయిర్‌పోడ్ మింగాడని తెలుసుకున్నాడు. ఈ విషయం స్కానింగ్ రిపోర్టులో బయటపడింది. అయితే ఇది మిండం వల్ల అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఎయిర్‌పోడ్స్కి అమర్చిన ప్లాస్టిక్ షెల్ కేసింగ్ తనను ఆనారోగ్యం బారీన పడకుండా కాపాడిందని తెలుసుకున్నాడు. కాగా ఎయిర్‌పోడ్స్ lithium-ion batteryతో చేసినవి అయి ఉంటే తన ప్రాణానికే ప్రమాదం పొంచి ఉండేదని దీని వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని ఈ వార్తా సంస్థకు ఆయన తెలిపారు.

చెవులకు పెట్టుకుని

చెవులకు పెట్టుకుని

ఈ విషయాన్ని డైలీ మెయిల్ ప్రచురించింది. ఇది పొందుపరిచిన కథనం ప్రకారం ఈ యువకుడు నిద్రపోతున్న సమయంలో ఆపిల్ ఎయిర్ పోడ్స్ చెవులకు పెట్టుకుని నిదరపోయాడని అయితే తెల్లారి లేచి చూసేసరికి ఒక ఎయిర్ బడ్ కనపడకపోవడంతో ఆందోళ చెందాడని తెలిపింది. అయితే దాన్నిరాత్రి నిదరపోతున్న సమయంలో మింగేశాడని తెలుసుకున్నాడు.

Find My iPhone app

Find My iPhone app

అయితే ఇతను మిస్సయిన Apple AirPodని వెతికేందుకు ఐఫోన్ లో ఉన్న Find My iPhone appని ఉపయోగించాడు. support pageలో పొందుపరిచన విధంగా అతను ఎయిర్ పోడ్ ని మ్యాప్ ద్వారా వెతకగా అది కడుపులో ఉన్నట్లు బయటపడింది. నాయిస్ ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతుంటే ఆశ్చర్యంగా తన కడుపులోనుంచి ఆ నాయిస్ సౌండ్ వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

Kaohsiung Municipal United Hospital

Kaohsiung Municipal United Hospital

ఆశ్చర్యం నుంచి తేరుకుని వెంటనే తనకు దగ్గర్లో ఉన్న Kaohsiung Municipal United Hospitalకు వెళ్లాడు. అక్కడ డాక్టర్లకు విషయం చెప్పగానే వారు వెంటనే స్కానింగ్ ద్వారా ానిని కనుక్కున్నారు. అది నిద్రలో తెలియకుండానే మింగేసావని చెప్పారు. అయితే అతను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కాకుండా మలం ద్వారా దాన్ని బయటకు తీయాలని కోరారు. అయితే అది ప్రయత్నం చేస్తానని సాధ్యం కాకుంటే శస్త్ర చికిత్స ద్వారా దానిని తీయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. దీని వల్ల మీకు ఎటువంటి ప్రమాదం కూడా ఉండదని ఆయన తెలిపారు.

మలం ద్వారా బయటకు

మలం ద్వారా బయటకు

అయితే డాక్టర్లు చెప్పినట్లే అతను చేయగా మరుసటి రోజు రైల్వే టాయిలెట్లో ఆ ఎయిర్ బడ్ బయటకు వచ్చింది. దాన్ని క్లీన్ చేసి పరీక్షించగా అది సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపాడు. అందులోని బ్యాటరీ దాదాపు 40 శాతం వరకు ఉందని అది సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇది చాలా మిరాకిల్ అని ఊహించలేదని ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానని ఆయన తెలిపారు.

Best Mobiles in India

English summary
Apple AirPods Reportedly Survive Journey Through Human Digestive Tract After Man Accidentally Swallows One

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X