USB-C ఛార్జింగ్ కేస్‌తో Airpods Pro 2nd Gen విడుదల.. ధర, ఫీచర్లు, సేల్ వివరాలు
ఆపిల్ సంస్థ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను సంస్థ మంగళవారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. దీంతోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను కూడా విడుదల చేసింది. దీంతోపాటు USB-C ఛార్జింగ్ కేస్‌తో కూడిన సెకండ్ జనరేషన్ Airpods Pro, వైర్డ్ ఇయర్‌పాడ్‌లతో కూడిన ఉత్పత్తులను విడుదల చేసింది.
సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇప్పుడు Magsafe కేస్‌లో USB-C పోర్టు, స్పీకర్, ల్యానార్డ్ లూప్‌ను కలిగి ఉంది. మెగ్‌సేఫ్ USB-C ఛార్జింగ్ కేస్‌లో ఆపిల్ H2 హెడ్‌ఫోన్ చిప్, ఆపిల్ U1 చిప్‌ను వినియోగించారు. ఫలితంగా టచ్, వాయిస్ కమాండ్ల ద్వారా వీటిని నియంత్రించవచ్చు.

బ్లూటూత్ 5.3, అడాప్టివ్ EQ సహా ఫోన్ కాల్స్ కోసం రెండు మైక్రోఫోన్లను కలిగి ఉంది. ఇది పూర్తిగా వాయిస్‌పైన దృష్టిపెడుతుంది. ఎయిర్‌పాడ్స్ ప్రో స్పెషియల్ ఆడియోను సపోర్టు చేస్తుంది. ప్రత్యేక దిశ నుంచి ధ్వని వస్తున్న అనుభూతి కలుగుతుంది. మెరుగైన ఫిట్ కోసం ఇయర్ టిప్ సైజ్‌లకు కూడా అందిస్తోంది. ఎయిర్‌పాడ్స్ ప్రో IP54 రేటింగ్ డస్ట్ రెసిస్టెన్స్‌తోపాటు ఆపిల్ విజన్‌ప్రో లాస్‌లెస్ ఆడియో అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుంది.
సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఆపిల్ విజన్ ప్రోలోని H2 చిప్, వైర్‌లైస్ ఆడియో ప్రోటోకాల్‌తో కలిపి 20 bit, 48kHz లాస్‌లెస్ ఆడియో లేటెన్సీతో అందుబాటులోకి వస్తుంది. అడాప్టివ్ ఆడియో లిజలింగ్ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. ఫలితంగా అవసరరమైన ధ్వనిని నియంత్రణ చేస్తుంది.
ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఇయర్‌బడ్స్‌తో 6 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. మరియు ఛార్జింగ్ కేస్‌తో 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు గంట బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సంస్థ చెబుతోంది.
USB-C పోర్టులో అందుబాటులోకి వచ్చిన రెండో తరం ఎయిర్‌పాడ్స్ ప్రోను రూ.24,900 ధరకు కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 22 నుంచి ఈ ఎయిర్‌పాడ్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే కేవలం కేస్‌ను విడిగా కొనుగోలు చేసేందుకు అవకాశం లేనట్లు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి ఆపిల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సహా ఆపిల్‌వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను విడుదల చేసింది. ఇవి కూడా సెప్టెంబర్ 22 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏ ఆన్‌లైన్ పోర్టల్‌లో కొనుగోలకు అందుబాటులో ఉంటాయో వెల్లడికాలేదు. అయితే ఆపిల్ స్టోర్లలో మాత్రం కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications