మేడ్ ఇన్ ఇండియా.. హైదరాబాద్‌లో ఆపిల్ AirPods తయారీ!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ఆపిల్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ AirPods హైదరాబాద్ ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో తయారీ కానున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్లాంట్‌లో 400 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడికి సంస్థ ఆమోదం తెలిపింది. 2024 డిసెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ఫ్యాక్టరీ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ చేస్తుంది. ఈ ప్లాంట్ డిసెంబర్ 2024 నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది అని ఓ వార్త సంబంధిత వర్గాల నుంచి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆపిల్ ఐఫోన్లు భారత్‌లో తయారవుతుండగా.. ఎయిర్‌పాడ్స్ కూడా త్వరలో భారత్‌లో ఉత్పత్తి కానున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఇయర్‌పాడ్స్ AirPodsకు మంచి మార్కెట్ ఉంది. డిసెంబర్ 2022 సంవత్సరంలో ప్రపంచవ్యప్తంగా ఆపిల్ TWS ఎయిర్‌పాడ్స్ 36 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నట్లు పరిశోధన సంస్థ కెనాలిస్ తెలిపింది. ఆపిల్ అనంతరం శాంసంగ్, షియోమీ, బోట్, ఒప్పో సంస్థలు ఉన్నాయి. నోయిడాలోని ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో షియోమీ సంస్థ తన TWS ఎయిర్‌పాడ్స్‌ను ఈ సంవత్సరం ప్రారంభించింది.
అయితే ఆపిల్ ఫోన్ల తయారీ టాటా చేతికి వస్తుందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. భారత్‌లో ఆపిల్ ఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ సంస్థ, టాటా సంస్థల మధ్య ఒప్పందం తుదిదశకు చేరుకుందని వార్తలు వచ్చాయి. భవిష్యత్‌లో విస్ట్రాన్ సంస్థ ఐఫోన్ల తయారీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఒప్పందంపై టాటా, విస్ట్రాన్ సంస్థలు ఎటువంటి ప్రకటన చేయలేదు.
*సెప్టెంబర్ 13 తేదీన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ఆధారంగా కొత్త మోడల్ ఫోన్లు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో వస్తాయి. మరియు USB టైప్-C పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్‌లు A17 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు A16 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తాయని సమాచారం. అయితే విడుదల, ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లు సాధారణ మెరిసే రంగులకు బదులుగా ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్‌లతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రీన్, మిడ్‌నైట్, పింక్, ప్రోడక్ట్, స్టార్‌లైట్, పసుపు రంగు లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీదైన ప్రో మోడల్ తరహాగానే ఉంటాయని సమాచారం. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








