Home
News

ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ దొంగిలించకుండా ఉండేందుకు ఈ యూజర్‌ ఏం చేశాడో తెలుసా..!!

ఆపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రీమియం ఎయిర్‌పాడ్స్‌ లో ఒకటిగా ఉన్నాయి. ధరకు అనుగుణంగా మెరుగైన పనితీరును కనబరుస్తాయి. దీంతోపాటు వీటిని దొంగిలించే వారు కూడా అధికం అవుతున్నారు. దొంగిలించిన అనంతరం బ్లాక్ మార్కెట్‌ లేదా సెకెండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. తన ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ను కాపాడుకొనేందుకు ఓ యూజర్‌ ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఆ ఆలోచన ఇంటర్నెట్‌లో అనేక మందిని ఆశ్చర్యానికి (Man Adds Micromax Logo His Apple Airpods) గురిచేసింది. మరియు ప్రశంసలు అందుకొనేలా చేసింది.

ఎయిర్‌పాడ్స్‌ ను దొంగలించకుండా ఉండేందుకు :
X (ట్విట్టర్) యూజర్‌ Basked Samosa ( @basked-samosa ) షేర్‌ చేసిన పోస్ట్‌ 4,00,000 కంటే ఎక్కువ వ్యూస్‌ ను సొంతం చేసుకున్నాయి. తన ఎయిర్‌పాడ్స్‌ను దొంగలించకుండా ఉండేందుకు ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌కు మైక్రో మ్యాక్స్‌ లోగో ను అతికించాడు. ప్రస్తుతం ఈ ఆలోచనను అనేక మంది ప్రశసిస్తున్నారు.

NCR man sticks micromax logo his apple airpods

నెటిజన్లు ఫిదా.. :
ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ పై మైక్రో మ్యాక్స్ లోగోను అతికించడం వల్ల ఎటువంటి దొంగతనం జరగదని భావించినట్లు సదరు యూజర్‌ తెలిపారు. మైక్రోమ్యాక్స్‌ కు చెందిన ఉత్పత్తిగా భావించి వదిలిపెడతారని భావించానన్నారు. నెటిజన్లు ఈ వినూత్న ఆలోచనపై కామెంట్లు రూపంలో అభినంధనలు చెబుతున్నారు.

పట్టపగలే బైక్‌ లపై వచ్చి బెదిరించి :
ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ను కొనుగోలు చేసినప్పుడు NCR (నేషలన్‌ క్యాపిటల్‌ రీజియన్‌) అంటే దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో నివాసం ఉండేవాడినని చెప్పాడు. తన స్నేహితుల్లో అనేక మంది ఎయిర్‌పాడ్స్‌ దొంగతనానికి గురవడం తాను గుర్తించినట్లు తెలిపారు. పట్టపగలే బైక్‌లపై వచ్చి బెదిరించి ఫోన్‌లను తీసుకెళ్లడం కూడా తాను చూసినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు తన వస్తువులు ఏవీ కూడా దొంగిలించబడలేదని తెలిపారు.

ఈ వినూత్న ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కస్టమైజేషన్‌ ఆప్షన్‌ ను తన విలువైన గ్యాడ్జెట్‌ ను కాపాడుకొనేందుకు ఉపయోగించారని అభినందించారు. ప్రస్తుతం విలువైన వస్తువుల దొంగతనాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆలోచన విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ యూజర్‌ ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Basked Samosa (@basked-samosa) యూజర్‌ జూన్ 9 పోస్ట్‌ చేయగా.. నెటిజన్లు ఈ వినూత్న ఆలోచనను మెచ్చుకున్నారు. భారీగా పోస్ట్‌ను లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫోటో కూడా ఆసక్తికరంగా ఉంది. మైక్రోమ్యాక్స్‌ ఉత్పత్తి తరహానే కనిపిస్తోంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
apple airpods user sticks micromax logo to his airpods to save from thieves
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X