కోడింగ్ నేర్చుకోవడానికి పిల్లలకు అందుబాటులో గల ఆపిల్ & గూగుల్ యాప్‌లు

|

టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా కోడింగ్ నేర్చుకోవడం కోసం అధికంగా మొగ్గూ చూపుతున్నారు. ప్రస్తుత రోజులలో ఆపిల్ మరియు గూగుల్ సంస్థలు కోడింగ్ బోధించడానికి అనేక విధానాలను అందిస్తున్నాయి. చిన్న వయస్సులో స్కూల్ పిల్లలు కూడా కోడింగ్‌లో మెళుకువలు నేర్చుకోవడం కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. యాపిల్ మరియు గూగుల్ రెండూ కూడా చిన్న పిల్లలకి కోడింగ్‌ను నేర్పించడానికి సహాయపడే కొన్ని అంకితమైన యాప్‌లు మరియు సేవలను కలిగి ఉన్నాయి. ప్రతి ఒక విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో అన్వేషించడానికి, ముందుకు సాగడానికి మరియు విజయం సాధించడానికి అవకాశం ఉందని Google విశ్వసిస్తుంది. ప్రాథమిక మరియు అధునాతన స్థాయి కోడింగ్ నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడే 10 రకాల యాప్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Grasshopper

Grasshopper

గ్రాస్ హోపర్ అనేది జావాస్క్రిప్ట్‌లో మెరుగైన నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రారంభ అభ్యాసకుల కోసం ఉపయోగించే ఒక కోడింగ్ యాప్. అభ్యాసకులు వారి కోడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి క్రమంగా సవాలు స్థాయిల ద్వారా ముందుకు సాగవచ్చు.

 

శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??శామ్‌సంగ్ గెలాక్సీ A52 ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??

క్లౌడ్ స్టాప్ మోషన్

క్లౌడ్ స్టాప్ మోషన్

క్లౌడ్ స్టాప్ మోషన్ జూమబుల్ యాప్ అనేది స్క్రోల్ చేయగల టైమ్‌లైన్‌లో యానిమేషన్‌లతో పని చేయడానికి పిల్లలను అనుమతిస్తుంది. MP4 సినిమాకి అందించే ముందు సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, టైటిల్స్, క్రెడిట్స్ మరియు స్పీచ్ బుడగలు యొక్క విస్తృతమైన లైబ్రరీ జోడించబడతాయి. ఈ యాప్ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల కోసం చాలా బాగుంది.

కోడ్‌కాడమీ
 

కోడ్‌కాడమీ

కోడ్‌కాడమీ అనేది ఆన్‌లైన్‌లో కోడ్ చేయడం మరియు నేర్చుకోవడానికి ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన మరియు అందుబాటులో గల వాటిలో ఒకటిగా ఉంది. దీని ద్వారా ఎవరైనా మెరుగైన నైపుణ్యాలను పొందడం మరియు సాంకేతికతతో అర్థవంతమైనదాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. వెబ్ డెవలప్‌మెంట్ మరియు డేటా సైన్స్, పైథాన్, CSS మరియు జావాస్క్రిప్ట్ వంటి డిమాండ్ ఉన్న భాషలలో వందలాది కోర్సులను యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

కోడబుల్

కోడబుల్

జావాస్క్రిప్ట్‌లో సున్నా నుండి 100 శాతం వరకు కంప్యూటర్ సైన్స్ గురించి వారు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని ఈ యాప్ పిల్లలకు బోధిస్తుంది. ప్రారంభంలో ఇది ఉచితంగా లభిస్తుంది. అలాగే ఇది నెలకు రూ.519 నుండి యాప్ కొనుగోళ్ల ప్లాన్ లను కలిగి ఉంది. 4-10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం కోడబుల్ ఫీచర్లు వయస్సుకి తగిన గేమ్స్ మరియు ఇతర కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ఇది పిల్లలు ప్రోగ్రామ్ లాగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవడం నుండి దాని కస్టమ్, బిల్ట్-ఫర్-కిడ్స్ కోడింగ్ ఇంటర్‌ఫేస్ ఉపయోగించి నిజమైన కోడ్ రాయడం వంటివి నేర్పుతుంది.

WhatsApp, iPhone, Samsung లింక్ కొత్త ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలుWhatsApp, iPhone, Samsung లింక్ కొత్త ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు

స్విఫ్ట్ ప్లేగ్రౌండ్‌లు

స్విఫ్ట్ ప్లేగ్రౌండ్‌లు

స్విఫ్ట్ అనేది యాపిల్ చేత సృష్టించబడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేడు అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లను రూపొందించడానికి ప్రొఫెషనల్స్ దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లో ఆపిల్ సృష్టించిన పాఠాలు ఉన్నాయి. ఇవి పజిల్స్ పరిష్కరించడానికి కోడ్‌ను ఉపయోగించడం ద్వారా ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన భావనల ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇది ఐప్యాడ్ కోసం మాత్రమే ఉచితంగా లభిస్తుంది. అలాగే ఇది 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థుల కోసం ఉద్దేశించిన కొద్దిగా అధునాతన యాప్.

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్రయోజనంతో ఎయిర్‌టెల్, జియోకు పోటీగా Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు...డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్రయోజనంతో ఎయిర్‌టెల్, జియోకు పోటీగా Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు...

కోడ్‌స్పార్క్ అకాడమీ

కోడ్‌స్పార్క్ అకాడమీ

కోడ్‌స్పార్క్ అకాడమీ బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లను పజిల్స్, గేమ్‌లు, స్టెప్ బై స్టెప్ క్రియేటివ్ ప్రాజెక్ట్‌లు, గేమ్ డిజైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రింటబుల్‌లతో సహా వివిధ ఇంటరాక్టివ్ లెర్నింగ్ కార్యకలాపాలను బోధిస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ తల్లిదండ్రులు పర్యవేక్షించడానికి కూడా అనుమతిని ఇస్తుంది. ఇది యాప్ స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది.

రీప్లిట్

రీప్లిట్

Google ప్రకారం ఇది సరళమైన, శక్తివంతమైన ఆన్‌లైన్ కోడింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది మొదటిసారిగా కోడింగ్ చేస్తున్న ప్రారంభకులకు, దశాబ్దాల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు మరియు ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ల అవసరాలకు కూడా సరిపోతుంది. రీప్లిట్ యాప్ పైథాన్, జావా, జావాస్క్రిప్ట్+HTML/CSS, మరియు C/C ++ సహా అన్ని ప్రోగ్రామింగ్ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది Chromebook లతో సహా ప్రతి పరికరంలోనూ అమలు అవుతుంది.

స్క్రాచ్ జూనియర్

స్క్రాచ్ జూనియర్

ఈ యాప్ యువ అభ్యాసకుల కోసం రూపొందించబడింది అని గూగుల్ తెలిపింది. స్క్రాచ్ జూనియర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంది. ఇది పిల్లలకు వారి స్వంత ఇంటరాక్టివ్ స్టోరీస్ మరియు గేమ్‌లను సృష్టించడం ద్వారా ప్రోగ్రామ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది.

టింకర్‌బ్లాక్స్

టింకర్‌బ్లాక్స్

ఆరు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల బాలికలు మరియు అబ్బాయిల కోసం కోడింగ్ యాప్ అందుబాటులో ఉంది. టింకర్‌బ్లాక్‌లతో పిల్లలు తాకగలిగే సాధారణ ప్రోగ్రామింగ్ భాష ద్వారా కోడింగ్‌లోకి ప్రవేశిస్తారు. కమాండ్‌లు, పారామీటర్‌లు, విధులు, లూప్‌లు, షరతులు, రకాలు, కోడ్‌ని అర్థం చేసుకోవడం వంటి బగ్‌లను ఎలా పరిష్కరించాలో యాప్‌లో ఉందని డెవలపర్లు పేర్కొన్నారు. ఈ యాప్‌ను రూ.269 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

టైంకర్ జూనియర్

టైంకర్ జూనియర్

గూగుల్ ప్రకారం చదవడం నేర్చుకునే పిల్లల కోసం ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 5-7 సంవత్సరాల పిల్లలు వారి అక్షరాలను తరలించడానికి పిక్చర్ బ్లాక్‌లను కనెక్ట్ చేయడం ద్వారా కోడింగ్ యొక్క స్టార్టింగ్ లను నేర్చుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Apple and Google Apps Available For Kids to Learn Coding

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X