క్లారిటీ వేటలో గుగూల్.. ఆపిల్!

By Super
|
Apple and Google researching to develop sophisticated Aerial Maps


లండన్: టెక్నాలజీ దిగ్గజం గుగూల్, తాను ప్రవేశపెట్టిన ఏరియల్ మ్యాపింగ్ కు మరింత స్పష్టతను జోడించే క్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన 20 విమానాలను రంగంలోకి దింపింది. ఈ టెక్నాలజీ అందుబాటులోలేని ఆపిల్ సంస్థ 'స్పై ఇన్ ద స్కై' టెక్నాలజీ కలిగిన సి3 టెక్నాలజీస్ సంస్థకు తన ఏరియల్ మ్యాపింగ్ ప్రాజెక్టును అప్పజెప్పింది. ఆ సంస్థ ఇప్పటికే లండన్ సహా 20 నగరాల్లో మ్యాపింగ్ పూర్తిచేసింది.

ఇదంతా ఎందుకంటే... ఇప్పటిదాకా ఈ సంస్థలు రూపొందించిన ఏరియల్ మ్యాపులను జూమ్‌చేస్తే పూర్తివివరాలు స్పష్టంగా కనిపించవు. ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నంలో భాగంగానే.. అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదుల జాడను పసిగట్టి లక్ష్యాల్ని ఛేదించేందుకు అమెరికన్ నిఘా వర్గాలు వాడిన శక్తిమంతమైన టెక్నాలజీతో సరితూగే పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఇలా తీసే చిత్రాలను జూమ్‌చేసినా నాణ్యత తగ్గదు. నాలుగు అంగుళాల సమీపందాకా దేన్నయినా స్పష్టంగా చూడొచ్చు.

ఈ స్పై విమానాలు గంటకు 40 చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని చిత్రించగలవు. రెండువైపులా పదునుగల కత్తి లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడను సుఖమయం, సరళం చేయడం నిజమే. కానీ.. అదే టెక్నాలజీ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకువస్తే ఇబ్బందులేమిటో అనుభవంలోకి రానుం ది. "ఇది కొనసాగితే భవిష్యత్తులో బహిరంగంగా ఏమీ చేయలేం.

మనం ఎక్కడ, ఏంచేస్తున్నా ఏ గూగుల్ విమానం చూస్తుందో, యాపిల్ టెక్నాలజీ పసిగడుతుందోనని అనుక్షణం భయపడాల్సిందే'' అని బిగ్ బ్రదర్ వాచ్ డైరెక్టర్ నిక్ పికిల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మ్యాపులు రూపొందిస్తున్న టెక్ దిగ్గజాలు వాటిని ఆన్‌లైన్‌లో ఉంచే ముం దు సంబంధితుల అనుమతి తీసుకునేట్టు చేయాలని ఆయన ప్రతిపాదిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X