ఆపిల్ WWDC 2024.. ఆపిల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసా.. మరింత స్మార్ట్‌గా మారుస్తుందా..!!
ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో (Apple WWDC Event 2024) సంస్థ అనేక సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌ల పై ప్రకటన చేసింది. iOS 18, ఐప్యాడ్OS 18, వాచ్OS 11, macOS sequoia సహా కీలక ఫీచర్‌లతో సిరీని అప్ డేట్ చేసింది. దీంతోపాటు మరో ముఖ్యమైన ఫీచర్ పై ప్రకటన చేసింది. అదే ఆపిల్ ఇంటెలిజెన్స్ (Apple Intelligence). ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సామర్థ్యాలను పొందనున్నాయి.
ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్.. పరికరాలను మరింత స్మార్ట్ గా మారుస్తుంది. సహాజమైన ఫోటోలను రూపొందించవచ్చు. రోజువారీ పనులను సులభంగా చేసేందుకు వీలుగా ఉంటుంది. దీంతోపాటు మెయిల్‌లను సక్రమంగా రాసేందుకు ఉపయోగపడుతుంది. కేవలం ఒకే క్లిక్ తో ఈమెయిల్‌లోని డేటాను సరిదిద్దవచ్చు.

దీంతోపాటు జెన్‌మోజీ (Genmoji) ద్వారా సరైన ఎమోజీలను రూపొందించవచ్చు. స్టిక్కర్ ద్వారా మీ ప్రతిస్పందనను తెలియజేయవచ్చు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఫీచర్‌తో యూజర్ల అవసరాలు, వివరణలకు అనుగుణంగా ఫోటోలను రూపొందించవచ్చు. ఈ ఫోటోలను మెసెజ్‌ల ద్వారా పంపవచ్చు. ఫలితంగా మెరుగైన అనుభవం సొంతమవుతుంది.
ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లో Cleanup Tool ను కలిగి ఉంటుంది. ఈ టూల్ ద్వారా ఫోటోలో అవసరం లేని వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. మీ కాల్స్, మీటింగ్‌లను నోట్స్ రూపంలో పొందవచ్చు. దీంతోపాటు ఐఫోన్ యూజర్‌లు ChatGPT GPT-4o మోడల్‌ను పొందవచ్చు. దీని ద్వారా కంటెంట్‌ను రూపొందించడం, ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఫోటోలను రూపొందించవచ్చు.
AI చాట్‌బోట్‌లో Siri ని అనుమతించాలా వద్ద అనే నియంత్రణను కలిగి ఉంటారు. Siri ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను కలిగి ఉండనుంది. మీరు కోరిన విధంగా పనులు చేసి పెడుతుంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌ల గురించి సిరిని అడిగి తెలుసుకోవచ్చు. దీంతోపాటు మీ ఐఫోన్‌లోని ఫైల్స్, ఫోటోలు, లింక్‌లను వెతికి పెడుతుంది.
ఈ ఈవెంట్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iOS 18 ను ప్రకటన చేసింది. దీని ద్వారా హోమ్ స్క్రీన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్ ఐకాన్‌లను డార్క్ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. హోమ్ స్క్రీన్ ఐకాన్‌ల కలర్‌లు మార్చుకొనేందుకు వీలుంది. దీంతోపాటు పునరుద్ధరించిన కంట్రోల్ సెంటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు బటన్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. మరియు సెట్సింగ్స్‌ను మార్చుకోవచ్చు. లాక్ స్క్రీన్‌ను ఈ మార్పులు చేయవచ్చు.
భద్రత పరంగా iOS 18 మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. Lock an యాప్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఐఫోన్‌లోని డేటాను మరింత భద్రతనిస్తుంది. యాప్‌లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టవచ్చు. మరియు లాక్ చేయవచ్చు. ఈ OS ద్వారా మెసెజ్‌లను మీకు కావాల్సిన సమయానికి షెడ్యూల్ చేయవచ్చు. మరియు ఎమోజీలను ఉపయోగించవచ్చు. మెసెజ్‌ల్లో యానిమేషన్లను కూడా పంపవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications