Apple యూజర్ల కోసం కొత్తగా ట్యాప్-టు-పే ఫీచర్!! పేమెంట్స్ మరింత సురక్షితం...

|

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఈరోజు తన యొక్క ఐఫోన్‌ వినియోగదారుల కోసం కొత్తగా ట్యాప్-టు-పే ఫీచర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో తమ ఐఫోన్‌లను పేమెంట్ టెర్మినల్స్‌గా మార్చడం ద్వారా వ్యాపారాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. వినియోగదారులు తమ ఐఫోన్‌లను ఉపయోగించి ఆపిల్ పే, కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు మరియు ఇతర డిజిటల్ వాలెట్‌ల అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండానే తమ యొక్క పరికరాలను సులభంగా నొక్కడం ద్వారా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ట్యాప్-టు-పే కొత్త ఫీచర్

ఆపిల్ యొక్క ట్యాప్-టు-పే కొత్త ఫీచర్ ఐఫోన్ XS మరియు తదుపరి మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. ఇది పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు యాప్ డెవలపర్‌లు వారి iOS యాప్‌లలో కలిసిపోవడానికి మరియు వారి కస్టమర్‌లకు పేమెంట్ ఎంపికగా అందించడానికి కూడా అందుబాటులో ఉంటుంది. తమ కస్టమర్లకు ఐఫోన్‌లలో ట్యాప్-టు-పే ఫీచర్‌ను అందించే మొదటి పేమెంట్ ప్లాట్‌ఫామ్ స్ట్రైప్ అని కంపెనీ తెలిపింది. ఇది ఈ వసంతకాలంలో Shopify పాయింట్ ఆఫ్ సేల్ యాప్‌లోకి వస్తుంది. ఈ ఏడాది చివర్లో USలోని అదనపు పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు మరియు ఆపిల్ స్టోర్ స్థానాల్లో ఈ ఫీచర్ వస్తుందని కంపెనీ తెలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డిస్కవర్, మాస్టర్ కార్డ్ మరియు వీసా వంటి కార్డులతో సహా పేమెంట్ నెట్‌వర్క్‌ల నుండి కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లతో iPhoneలో ట్యాప్-టు-పే ఫీచర్ పని చేస్తుందని కంపెనీ తెలిపింది.

గూగుల్ క్రోమ్ లోగో 8 సంవత్సరాల తరువాత కొత్త మార్పులతో అప్‌డేట్ అయింది!!గూగుల్ క్రోమ్ లోగో 8 సంవత్సరాల తరువాత కొత్త మార్పులతో అప్‌డేట్ అయింది!!

Apple యొక్క ట్యాప్-టు-పే ఫీచర్ ఎలా పనిచేస్తుంది

Apple యొక్క ట్యాప్-టు-పే ఫీచర్ ఎలా పనిచేస్తుంది

ఆపిల్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ట్యాప్-టు-పే ఫీచర్ పేమెంట్లను ప్రారంభించడానికి NFC టెక్నాలజీను ఉపయోగిస్తుంది. ఐఫోన్‌లలో ట్యాప్-టు-పే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపారులు తమ వినియోగదారులకు సపోర్టింగ్ ఐఓఎస్ యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ను అందించగలరని కంపెనీ తెలిపింది. చెక్అవుట్ సమయంలో వ్యాపారి ఆపిల్ పే, కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా వ్యాపారి iPhoneకి సమీపంలో ఉన్న ఇతర డిజిటల్ వాలెట్‌తో చెల్లించడానికి వారి ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్ ని ఉపయోగించమని కస్టమర్‌ను ప్రాంప్ట్ చేస్తారు. ఆ తర్వాత పేమెంట్ సురక్షితంగా పూర్తవుతుంది.

కొత్త గ్రహాల సృష్టికి కనుమరుగయ్యే నక్షత్రాలకు మధ్య సంబంధంపై శాస్త్రవేత్తల అభిప్రాయంకొత్త గ్రహాల సృష్టికి కనుమరుగయ్యే నక్షత్రాలకు మధ్య సంబంధంపై శాస్త్రవేత్తల అభిప్రాయం

Apple ట్యాప్-టు-పే ఫీచర్ భద్రత విషయం?

Apple ట్యాప్-టు-పే ఫీచర్ భద్రత విషయం?

గోప్యత విషయంలో ఆపిల్ ఐఫోన్ లో ట్యాప్-టు-పేతో ఆపిల్ పేని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కస్టమర్ల పేమెంట్ డేటాను సురక్షితంగా రక్షించబడుతుంది. ఇంకా ఏమి కొనుగోలు చేస్తున్నారో లేదా ఎవరు కొనుగోలు చేస్తున్నారో కూడా కంపెనీకి తెలియదు. లభ్యత విషయానికొస్తే ఆపిల్ తన ట్యాప్-టు-పే ఫీచర్‌ను యుఎస్‌లోని వ్యాపారులకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

Best Mobiles in India

English summary
Apple Announced Tap-to-Pay Payment New Feature For iPhone Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X