Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

|

ఆపిల్ సంస్థ 2020 మరియు 2021 సంవత్సరాల్లో విడుదల చేసే తన కొత్త ఆరు పరికరాలలో మినీ-ఎల్ఈడి టెక్నాలజీను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఆపిల్ సంస్థ యొక్క విశ్లేషకుడు మింగ్-చి కుయో తెలిపిన వివరాల ప్రకారం ఈ పరికరాల యొక్క ఉత్పత్తి కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొంచెం ఆలస్యం అవుతోంది.

ఆపిల్

పెట్టుబడిదారులు ఆపిల్ 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రోకు కావలసిన సామాగ్రిని పంపిణి చేసినందున ఇప్పుడు సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోందని కుయో పేర్కొన్నాడు. దీనితో పాటుగా 27-అంగుళాల కొత్త ఐమాక్ ప్రో మరియు 14.1-అంగుళాల మాక్‌బుక్ ప్రోను కూడా తయారుచేస్తున్నాయి. ఐఫోన్ తయారీదారు 16 అంగుళాల మాక్‌బుక్ ప్రోకి అప్ డేట్ వెర్షన్ ను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటితో పాటుగా 10.2-అంగుళాల ఐప్యాడ్ మరియు 7.9-అంగుళాల ఐప్యాడ్ మినీ కూడా తదుపరి వరుసలో ఉన్నాయి.

 

 

Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్

మింగ్-చి కుయో

మింగ్-చి కుయో

సంస్థ యొక్క విశ్లేషకుడు మింగ్-చి కుయో తన ఇన్వెస్టర్ నోట్‌లో పైన పేర్కొన్న పరికరాల యొక్క లాంచ్ టైమ్‌లైన్‌ యొక్క వివరాలను అందించడం లేదు. ఏదేమైనా 27-అంగుళాల కొత్త ఐమాక్ ప్రో 2020 నాల్గవ త్రైమాసికంలో లాంచ్ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. అలాగే 7.9-అంగుళాల ఐప్యాడ్ మినీ కూడా ఈ సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్ మినీ LED ఉత్పత్తి యొక్క పరిశోధన మరియు అభివృద్ధి మీద COVID-19 ప్రభావం పడలేదు అని తెలిపారు. వాణిజ్యీకరణ యొక్క వివరాలు మునుపటి నివేదికలతో పోలిస్తే అంచనాలను మించి ఉన్నాయి అని కుయో తన నోట్‌లో వివరించారు.

 

 

ఆపిల్ ఐఫోన్స్ కార్మికుల మీద పడ్డ కరోనావైరస్ ప్రభావంఆపిల్ ఐఫోన్స్ కార్మికుల మీద పడ్డ కరోనావైరస్ ప్రభావం

ఆపిల్ మినీ-ఎల్ఈడి మెయిన్ స్ట్రీమ్

ఆపిల్ మినీ-ఎల్ఈడి మెయిన్ స్ట్రీమ్

13 అంగుళాల మాక్‌బుక్ ప్రో అప్ డేట్ వెర్షన్ ప్రత్యేక మోడల్ కు మినీ-ఎల్ఈడి మెయిన్ స్ట్రీమ్ ను తీసుకువస్తున్నారు. దీనిని 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో యొక్క చిన్న వెర్షన్‌గా కూడా తయారుచేస్తున్నారు. కొంతకాలంగా ఆపిల్ తన చిన్న మాక్‌బుక్ ప్రో కోసం పనిచేస్తునున్నట్లు సూచనలు ఉన్నాయి. 14.1-అంగుళాల మాక్‌బుక్ ప్రోను రిఫ్రెష్ చేసి తిరిగి 16-అంగుళాల మాక్‌బుక్ ప్రోతో పాటు ఒకే సారి లాంచ్ చేయనున్నారు. ఇప్పుడున్న 13-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో కనిపించే బటర్ ఫ్లై కీబోర్డ్‌కు బిన్నంగా 14.1-అంగుళాల మాక్‌బుక్ ప్రో మోడల్ సిస్సర్ స్విచ్ కీబోర్డ్‌ను అందించడాన్ని మనం చూడవచ్చు.

 

 

Dish TV,D2h ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త NCF ధరలు ఇవే...Dish TV,D2h ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త NCF ధరలు ఇవే...

మినీ-ఎల్‌ఈడీ-సపోర్ట్ ప్రొడక్ట్‌

మినీ-ఎల్‌ఈడీ-సపోర్ట్ ప్రొడక్ట్‌

ఆపిల్ సంస్థ యొక్క అభివృద్ధిలో గత ఐదేళ్లలో మినీ ఎల్‌ఈడీని ప్రోత్సహించే ధోరణి మరింత పెరిగింది. ఆపిల్ ప్రస్తుతం ఆరు మినీ-ఎల్‌ఈడీ-సపోర్ట్ ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది. వీటిలో 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో, 27-అంగుళాల ఐమాక్ ప్రో, 14.1-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 10.2-అంగుళాల ఐప్యాడ్ మరియు 7.9-అంగుళాల ఐప్యాడ్ మినీ ఉన్నాయి.

 

 

BSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతోBSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతో

ఆపిల్ ఉత్పత్తులు

ఆపిల్ ఉత్పత్తులు

ఆపిల్ తన 2020 ఉత్పత్తి శ్రేణిపై కరోనావైరస్ యొక్క ప్రభావాన్ని గుర్తించింది. ఆపిల్ యొక్క మినీ-ఎల్ఈడి ఉత్పత్తులు 2020 మరియు 2021 లో వస్తాయని కుయో తెలిపారు. 16 అంగుళాల మాక్‌బుక్ ప్రో ఈ సంవత్సరం మినీ-ఎల్ఈడి డిస్ప్లే టెక్నాలజీతో వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుపటి నోట్లో కుయో ఆపిల్ 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో కోసం మినీ-ఎల్ఈడి డిస్‌ప్లేను స్వీకరిస్తోందని చెప్పారు.

Best Mobiles in India

English summary
Apple Applying Mini-LED Technology On Six New Products

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X