షాకిచ్చిన ఆపిల్, ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీసు లాంచ్

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరోసారి సంచలనానికి తెరతీసి దిగ్గజాలను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది. తన సర్వీస్‌ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకునేందుకు చేసే కసరత్తులో భాగంగా సరికొత్తగా ముందుకు వెళుతోంది. ఎ

|

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ మరోసారి సంచలనానికి తెరతీసి దిగ్గజాలను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది. తన సర్వీస్‌ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకునేందుకు చేసే కసరత్తులో భాగంగా సరికొత్తగా ముందుకు వెళుతోంది. ఎప్పటినుంచో అనుకుంటూ వస్తున్న గేమింగ్‌, న్యూస్‌, టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఆపిల్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

షాకిచ్చిన ఆపిల్, ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీసు లాంచ్

ఆపిల్ టీవీ ప్లస్, కొత్త ఆపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలోనే ఆపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకు వస్తామని ప్రకటించింది.

ఆపిల్ ఆర్కేడ్

ఆపిల్ ఆర్కేడ్

ప్రధానంగా ఆపిల్ ఆర్కేడ్ పేరుతో వీడియో గేమ్ సర్వీసులను ఆవిష్కరించింది. సబ్‌స్క్రిప్షన్ ద్వారా పనిచేసే ప్రపంచంలోనే తొలి గేమింగ్‌ సర్వీసని ఆపిల్‌ ప్రకటించింది. ఇందులో 100కుపైగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవ్వన్నీ కేవలం ఆపిల్ డివైస్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి.

గేమ్ సర్వీసు అందించేవి ఇవే

గేమ్ సర్వీసు అందించేవి ఇవే

Annapurna Interactive, Bossa Studios, Cartoon Network, Finji, Giant Squid, Klei Entertainment, Konami, LEGO, Mistwalker Corporation, SEGA, Snowman, ustwo games and dozens నుంచి ఈ గేమ్స్ రానున్నాయి.

150 దేశాల్లో

150 దేశాల్లో

ఆపిల్ లాంచ్ చేసిన గేమింగ్ సర్వీసులు 2019 నాటికి దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. iOS, macOS,tvOS ఫ్లాట్ ఫాం మీద ఈ గేమ్ లు ఆడుకోవచ్చు.

ఎయిర్ పాడ్స్‌

ఎయిర్ పాడ్స్‌

ఆపిల్ త‌న ఎయిర్ పాడ్స్‌కు చెందిన నూత‌న వేరియెంట్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ కొత్త ఎయిర్ పాడ్స్‌లో నూత‌నంగా ఆపిల్ హెచ్‌1 హెడ్‌ఫోన్ చిప్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఐఫోన్ల‌కు వీటిని మ‌రింత వేగంగా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అలాగే క‌నెక్ష‌న్ కూడా స్థిరంగా ఉంటుంది.

డిజిటల్ అసిస్టెంట్ సిరి

డిజిటల్ అసిస్టెంట్ సిరి

ఇక ఈ ఎయిర్ పాడ్స్ లో ఆపిల్ డిజిటల్ అసిస్టెంట్ సిరి కి కూడా స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎయిర్ పాడ్స్ స‌హాయంతో సుల‌భంగా కాల్స్ చేసుకునేందుకు, మ్యూజిక్ వినేందుకు వీలు క‌లుగుతుంది.

ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే

ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే

ఈ ఎయిర్ పాడ్స్‌ను ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 5 గంట‌ల వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. కేవ‌లం 15 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే 3 గంట‌ల వ‌ర‌కు ఇవి ప‌నిచేస్తాయి. ఇక ఈ ఎయిర్ పాడ్స్ రూ.14,900 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానున్నాయి.

Best Mobiles in India

English summary
Apple Arcade, Apple introduces the ‘world’s first game subscription’ service More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X