Home
News

ఆపిల్‌ ప్రత్యేక సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌లు.. ఆఫర్‌ ఎప్పటి వరకు ఉందంటే?

Apple Back to School Sale : ప్రముఖ సంస్థ ఆపిల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బ్యాక్‌ టూ స్కూల్ ఆఫర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ సేల్‌ జూన్ 17 నుంచి సెప్టెంబర్‌ 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌ లో భాగంగా మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌ లను భారీ డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. విద్యార్థుల కోసం ఆపిల్‌ ఈ ప్రత్యేక సేల్‌ ను ప్రారంభించింది. భారత్‌లో ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ లో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ఆపిల్‌ బ్యాక్‌ టూ స్కూల్‌ సేల్‌ ఆఫర్‌ లో భాగంగా మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, మ్యాక్‌బుక్‌ ప్రో, ఐమ్యాక్‌, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్‌ ప్రో వంటి ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తోంది. అయితే డిస్కౌంట్‌ ఆఫర్లతోపాటు నిర్ది్ష్ట కొనుగోళ్లపై ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ పెన్సిల్‌ ను ఉచితంగా పొందవచ్చు.

Apple Back to school sale Offers

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (2025) :
ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (Macbook Air 2025) మోడల్‌ 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.99900 కు విడుదల చేసింది. అయితే ప్రస్తుతం రూ.10000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఫలితంగా రూ.89900 కే సొంతం చేసుకోవచ్చు. మ్యాజిక్‌ కీబోర్డ్‌, మ్యాజిక్‌ ట్రాక్‌ప్యాడ్‌, మ్యాజిక్‌ మౌస్‌ లేదా ఎయిర్‌పాడ్స్‌ 4 లో ఒకదానిని ఉచితంగా అందిస్తోంది.

మ్యాక్‌బుక్‌ ప్రో (2024) :
మ్యాక్‌బుక్‌ ప్రో M4 ను (Macbook Pro 2024) కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 14 అంగుళాల, 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.1,69,999 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం ఈ సేల్‌ లో భాగంగా రూ.1,59,900 కే సొంతం చేసుకోవచ్చు. మ్యాజిక్‌ కీబోర్డ్‌, మ్యాజిక్‌ ట్రాక్‌ప్యాడ్‌, మ్యాజిక్‌ మౌస్‌ లేదా ఎయిర్‌పాడ్స్‌ 4 లో ఒకదానిని ఉచితంగా అందిస్తోంది.

iMac 24 అంగుళాల వేరియంట్ :
ఐమ్యాక్‌ (iMac) 24 అంగుళాల డిస్‌ప్లే, 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.134900 గా ఉండగా.. ఆపిల్‌ బ్యాక్‌ టూ స్కూల్‌ ఆఫర్‌ లో భాగంగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.129900 కే సొంతం చేసుకోవచ్చు.

ఐప్యాడ్‌ ఎయిర్‌ (2025) :
11 అంగుళాల ఐప్యాడ్‌ 128GB (WiFi వేరియంట్‌) ధర రూ.59900 గా ఉంది. ఈ ఆపిల్‌ బ్యాక్ టూ స్కూల్‌ ఆఫర్‌ లో భాగంగా రూ.5000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.54900 కే ఈ ఐప్యాడ్‌ను (iPad Air 2025) కొనుగోలు చేయవచ్చు. సెల్యూలర్‌ వేరియంట్స్‌ను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఐప్యాడ్‌ ప్రో (2024) :
ఈ ఐప్యాడ్‌ ప్రో (iPad Pro) 11 అంగుళాల వైఫై వేరియంట్ ధర రూ.99900 గా ఉంది. ఈ సేల్‌ లో భాగంగా రూ.10000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో రూ.89900 కే ఈ ఐప్యాడ్‌ను సొంతం చేసుకోవచ్చు. సెల్యూలర్‌ వేరియంట్స్‌ను కూడా డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Apple Back to school sale Offers best deals on ipads and macbooks upto september 30 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X