మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి ఆపిల్ నెం.1

Posted By: Staff

మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి ఆపిల్ నెం.1

‘సోమవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు ధర గరిష్టంగా 664.74 డాలర్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డు ఆ టెక్నాలజీ దిగ్గజం సొంతమైంది.’

న్యూయర్క్: విభిన్న కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ ఉత్పత్తుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెక్నాలజీ దిగ్గజం ‘ఆపిల్’ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్, మ్యాక్‌బుక్ వంటి విభన్నమైన గ్యాడ్జెట్‌లను వివిధ వర్షన్‌లలో టెక్ ప్రపంచానికి అందిస్తూ వస్తున్నఈ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 62,300 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్)ను సాధించింది. దింతో 1999లో 61,900 కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ రికార్డును నమోదు చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్న టెక్నాలజీ దిగ్గజం మెక్రోసాఫ్ట్‌ను ఆపిల్ రెండో స్థానానికి నెట్టింది.

ఆపిల్ ఐప్యాడ్‌లను తయారు చేసే ఫ్యాక్టరీ ఏలా ఉంటుందో తెలుసా..?

ఆపిల్ ఐప్యాడ్‌లను తయారు చేసే చైనా సంస్థ ‘ఫాక్స్‌కాన్’కు వావ్ అనిపించే చరిత్రే ఉంది. నగరాన్ని తలపించే ఈ ఫ్యాక్టరీలోకి ఇతరులకు అనుమతి లభించటం చాలా కష్టం. మార్కెట్ ప్లేస్‌కు చెందిన రాబ్ స్కిమ్చ్‌కు ఫ్యాక్టరీలోనికి ప్రవేశించే అరుదైన అవకాశం లభించింది. ఇంకేం మనోడి ఆనందాలకు అవదులే లేవు. అందివచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్న రాబ్, అక్కడి పని వాతావరణాన్ని వీడియో రూపంలో చిత్రీకరించాడు. అంతేకాకుండా పలు ఆశ్చర్యకర విషయాలను రాబట్టాడు.

ఐప్యాడ్ తయారీ ప్రక్రియ ఆషామాషీ కాదు. ఈ డివైజ్ నిర్మాణానికి సంబంధించి కొన్ని పనులు రోబోట్‌లు మాత్రమే చక్కబెట్టగలవు. వేలాది మంది ఉద్యోగులు ఈ కంపెనీలో షిఫ్ట్స్ వారీగా నిరంతం పని చేస్తూనే ఉంటారు. ఆశాజనకమైన జీతాలను చెల్లించే కంపెనీలలో ఫాక్స్‌కాన్ ఒకటి. ఉద్యోగులను పని ఒత్తిళ్ల నుంచి దూరం చేసేందుకు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిమ్, ఒలంపిక్ పూల్, బాస్కెట్ బాల్, సాకర్ స్టేడియమ్‌లు అలసటను తగ్గించి పనిభారాన్ని పూర్తిగా దూరం చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot