Just In
- 42 min ago
iQOO 10, 10 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది!! ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి...
- 1 hr ago
2030 నాటికి భారత Fiber Broadband యూజర్లు @110 మిలియన్లు!
- 2 hrs ago
WhatsApp కొత్త స్కామ్: UKలో జాబ్, ఫ్రీ వీసా పేరుతో మెసేజ్ వచ్చిందా? జర జాగ్రత్త...
- 3 hrs ago
18GB RAM తో కొత్త ఫోన్ ఇండియా లో లాంచ్ అయింది ! ధర,ఇతర ఫీచర్లు చూడండి.
Don't Miss
- Automobiles
భారతదేశంలో మొట్టమొదటి 'అవెంటడార్ అల్టిమే కూపే' డెలివరీ చేసిన లంబోర్ఘిని: వివరాలు
- News
18 రోజుల్లో 8 ఘటనలు-వివరణ కోరుతూ స్పైస్ జెట్ కు డీజీసీఏ నోటీసులు జారీ
- Sports
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ఔషదంగా మారిన క్రికెట్!
- Movies
నరేష్ ఎలాంటి వాడో చెప్పిన సీనియర్ నటి పూజిత.. వందల మందికి అలా చేశాడంటూ!
- Finance
LIC Policy: మీ పిల్లల్ని లక్షాధికారి చేయాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్ లో రోజూ రూ.150 పొదుపు చేస్తే చాలు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
- Lifestyle
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఈ చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?
ఆపిల్ బ్రాండ్ ఫోన్లు Q1 2022లో అధికంగా అమ్ముడైన జాబితాలో మూడు ఉన్నాయి...
2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్ల జాబితాలో మొదటి రెండు స్థానాలను ఆపిల్ బ్రాండ్ కైవసం చేసుకున్నట్లు IDC నివేదిక పేర్కొన్నది. IDC విశ్లేషకుడు ఫ్రాన్సిస్కో జెరోనిమో విడుదల చేసిన నివేదిక ప్రకారం Q1 2022లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్ల యొక్క టాప్-ఐదు జాబితాలో ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ రెండు స్మార్ట్ఫోన్లు మొదటి రెండు స్థానాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ జాబితాలో నాల్గవ స్థానంలోకూడా ఆపిల్ బ్రాండ్ యొక్క మరొక హ్యాండ్సెట్ నిలవడం గమనార్హం. మిగిలిన మూడు మరియు ఐదవ స్థానాలను Samsung బ్రాండ్ హ్యాండ్సెట్లు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

IDC విశ్లేషకులు జెరోనిమో ఈ సమాచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 2022 క్యూ1 లో ఐఫోన్ 13 అగ్రస్థానంలో ఉండటంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆపిల్ ఆధిపత్యం చెలాయించింది. రెండవ స్థానంలో కూడా 6.7-అంగుళాల డిస్ప్లే గల ఆపిల్ బ్రాండ్ కి చెందిన ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫోన్ ఉంది. అలాగే 6.1-అంగుళాల స్క్రీన్‌తో లభించే ఐఫోన్ 13 ప్రో ఫోన్ నాల్గవ స్థానాన్ని అందుకొని ఆపిల్ బ్రాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆపిల్ కస్టమర్లు కొంచెం పెద్ద డిస్ప్లేతో లభించే కొత్త ఫోన్ల కోసం అదనపు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తున్నది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

2022 త్రైమాసికంలో ఐఫోన్ 13 విక్రయాలు దాదాపు 42 బిలియన్ డాలర్లు ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3,26,224 కోట్లుగా ఉన్నాయని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ఐఫోన్ యొక్క అమ్మకాల సంఖ్య 84 శాతం వరకు ఉంది. సరఫరా కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ ఆపిల్ గత సంవత్సరం అత్యంత లాభదాయకమైన సెలవు సీజన్‌ను (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) రికార్డ్ చేసిన తర్వాత దాని ఊపందుకుంటున్నది. ఈ కాలంలో కుపర్టినో కంపెనీ ఐఫోన్ అమ్మకాలు $71.63 బిలియన్లు (దాదాపు రూ. 5,56,393 కోట్లు)గా నివేదించింది.

మరోవైపు శామ్సంగ్ సంస్థ గెలాక్సీ A12 మరియు గెలాక్సీ A32 స్మార్ట్ఫోన్లతో Q1 2022 త్రైమాసికంలో అధిక అమ్మకాల జాబితాలో వరుసగా 3వ మరియు 5వ స్థానాల్లో చోటును దక్కించుకున్నది. Q1 2022 స్మార్ట్ఫోన్ల ఉమ్మడి అమ్మకాలలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం $3.6 బిలియన్లు ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దాదాపు రూ.27,963 కోట్లు ఆర్జించాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086