Apple బ్రాండ్ OLED స్క్రీన్‌తో కొత్త ఐప్యాడ్‌ను తీసుకురానున్నది!! లాంచ్ డేట్, ఫీచర్స్ ప్రత్యేకతలు...

|

ప్రపంచం మొత్తం మీద ఆపిల్ బ్రాండ్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ నుంచి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తుంది అంటే అందులో లభించే ప్రత్యేకతలపై అందరి దృష్టి ఉంటుంది. ఆపిల్ సంస్థ 2024 సంవత్సరంలో OLED డిస్‌ప్లేతో కూడిన ఐప్యాడ్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఆపిల్ బ్రాండ్ నుంచి రాబోయే OLED ఐప్యాడ్‌లు సన్నగా మరియు తేలికగా ఉంటాయని కొత్త నివేదిక పేర్కొంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం దేశీయ డిస్‌ప్లే భాగస్వాములతో కలసి పనిచేస్తూ OLED ఐప్యాడ్‌ల తుది నమూనాలను ఉత్పత్తి చేస్తోంది.

 

ఆపిల్

ఆపిల్ సంస్థ అనేక ప్రోటోటైప్‌లను సృష్టిస్తోంది మరియు పరీక్ష ప్రక్రియను అనేకసార్లు పునరావృతం చేస్తోంది. GSMArena ప్రకారం శామ్సంగ్ మరియు LG సంస్థలు రెండు ప్రధాన డిస్‌ప్లే సరఫరాదారులుగా ఉన్నాయి. ఈ రెండు సంస్థలు 2024 లో ఆపిల్ బ్రాండ్ నుంచి రాబోయే ఐప్యాడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త OLED ప్యానెల్‌లపై పని చేస్తున్నాయని చెప్పబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Alexa మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో మాట్లాడుతుంది!! త్వరలోనే అందుబాటులోకి...Amazon Alexa మీకు ఇష్టమైన వారి వాయిస్‌తో మాట్లాడుతుంది!! త్వరలోనే అందుబాటులోకి...

OLED డిస్ప్లే

ఆపిల్ సంస్థ మొదటిసారిగా తన బ్రాండ్ ఐప్యాడ్‌ల కోసం OLED డిస్ప్లే డ్రై ఎచింగ్ ప్రాసెస్‌ను కూడా పరిచయం చేయనున్నది. డిస్‌ప్లే డ్రై ఎచింగ్ అనేది సన్నని ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (TFT) సర్క్యూట్ నమూనాలను తయారు చేసేటప్పుడు కెమికల్ టెక్నాలజీను ఉపయోగించి అనవసరమైన భాగాలను తొలగించే ప్రక్రియ.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫ్లాష్ మెసేజ్‌లను డీయాక్టివేట్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫ్లాష్ మెసేజ్‌లను డీయాక్టివేట్ చేయడం ఎలా?

OLED నాణ్యత
 

OLED నాణ్యత సాపేక్షంగా చిన్నగా ఉండి దాని యొక్క భూకంప గుణకం ఎక్కువగా ఉంటుంది. OLED దాదాపు 170 డిగ్రీల వరకు విస్తృత దృష్టిని కలిగి ఉంది. OLED ప్రతిస్పందన వేగం చాలా వేగంగా ఉంటుంది మరియు ప్రతిస్పందన సమయం మైక్రోసెకన్లను మాత్రమే కలిగి ఉంటుంది. OLED యొక్క సేంద్రీయ ప్లాస్టిక్ పొర సన్నగా, తేలికగా మరియు మరింత సరళంగా ఉంటుంది. అయితే OLED ప్యానెల్ ని ఉత్పత్తి చేయడం అంత సులభం కాదు కాబట్టి ధర కూడా ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది.

రూ.1 లక్ష ఖరీదైన iPhone 13 Pro కు కాపీ ! ఈ ఫోన్ ధర రూ.7000 మాత్రమే. వివరాలు చూడండి.రూ.1 లక్ష ఖరీదైన iPhone 13 Pro కు కాపీ ! ఈ ఫోన్ ధర రూ.7000 మాత్రమే. వివరాలు చూడండి.

ప్రాజెక్ట్

ఆపిల్ మరియు శామ్సంగ్ సంస్థలు గత సంవత్సరం నుంచి 10.8-అంగుళాల OLED డిస్‌ప్లేను తయారు చేయడం మీద పని చేస్తున్నాయి. అయితే మొత్తం ప్రాజెక్ట్ Q3 2021లో నిలిపివేయవలసి వచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం ఆపిల్ రెండు స్టాక్ టెన్డం స్ట్రక్చర్‌తో కూడిన ప్యానెల్‌లను ఆర్డర్ చేసింది. కానీ శామ్సంగ్ సంస్థ కోసం ఈ ప్రాజెక్ట్ ఖరీదైనది మాత్రమే కాకుండా సరైన సమయంలో మరియు స్థలంలో అవసరమైనన్ని ప్యానెల్‌లను అందించలేకపోయింది.

iPad

Macs మరియు iPadల కోసం పెద్ద పరిమాణంలోని OLED డిస్ప్లేలను తయారు చేయడానికి ఆపిల్ సంస్థ BOEతో కలిసి పని చేస్తోంది. BOE 15-అంగుళాల పరిమాణంలో OLED డిస్‌ప్లేలను తయారు చేయగలదు. కొన్ని నివేదికల ప్రకారం కొత్త BOE ఫ్యాక్టరీ రెడ్, గ్రీన్ మరియు బ్లూ ఎమిషన్ పొరల యొక్క రెండు పొరలతో OLED డిస్ప్లేలను తయారు చేయగలదు. ఇది ఐప్యాడ్‌లు తమ స్క్రీన్‌ల నుండి అధిక ప్రకాశాన్ని అందించడానికి అనుమతిస్తుంది. BOE ప్రస్తుతం ఆపిల్ బ్రాండ్ యొక్క తాజా ఐఫోన్ 13 సిరీస్ కోసం OLED డిస్‌ప్లేలను సరఫరా చేస్తుంది.

ఆపిల్ లాక్‌డౌన్ మోడ్

ఆపిల్ లాక్‌డౌన్ మోడ్

ఆపిల్ సంస్థ తన యొక్క అన్ని రకాల డివైస్ లలో త్వరలో విడుదల చేయనున్న 'లాక్‌డౌన్ మోడ్' కొత్త ఫీచర్ కి సంబందించిన పూర్తి సమాచారం విషయానికి వస్తే ఇది దాని యొక్క పేరుకు తగ్గట్లుగా అక్షరాలా లాక్‌డౌన్‌లో ఉంటుంది. దీనిలో ఆపిల్ పరికరాల సామర్థ్యాలు తీవ్రంగా పరిమితం చేయబడి ఉండడంతో సైబర్ దాడికి అవకాశం తగ్గుతుంది. మీ యొక్క పరికరంలో లాక్‌డౌన్ మోడ్ ప్రారంభించబడినప్పుడు ఇమేజ్‌లు మాత్రమే కాకుండా చాలా మెసేజ్ అటాచ్‌మెంట్ రకాలు బ్లాక్ చేయబడతాయి. అంతేకాకుండా లింక్ ప్రివ్యూ వంటి కొన్ని రకాల ఫీచర్‌లు కూడా డిసేబుల్ చేయబడతాయని ఆపిల్ చెబుతోంది.

Apple లాక్‌డౌన్ మోడ్ ఎలా పని చేస్తుంది?

Apple లాక్‌డౌన్ మోడ్ ఎలా పని చేస్తుంది?

వినియోగదారులు తమ యొక్క డివైస్ లలో ఏదైనా విశ్వసనీయ సైట్‌ను లాక్‌డౌన్ మోడ్ నుండి మినహాయించకపోతే కనుక జస్ట్-ఇన్-టైమ్ (JIT) జావాస్క్రిప్ట్ కంపైలేషన్ వంటి నిర్దిష్ట సంక్లిష్టమైన వెబ్ టెక్నాలజీలు నిలిపివేయబడతాయని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా వినియోగదారులు ఇంతకుముందు ఇనిషియేటర్‌కు కాల్ లేదా అభ్యర్థనను పంపకపోతే ఫేస్‌టైమ్ కాల్‌లతో సహా ఇన్‌కమింగ్ ఇన్విటేషన్ మరియు సర్వీస్ అభ్యర్థనలను కూడా కంపెనీ బ్లాక్ చేస్తుంది. అదనంగా ఐఫోన్ లాక్ చేయబడినప్పుడు కంప్యూటర్ లేదా వాటి యాక్సెసరీతో వైర్డు కనెక్షన్‌లు బ్లాక్ చేయబడతాయని కంపెనీ తెలిపింది. అలాగే లాక్‌డౌన్ మోడ్ ఆన్‌లో ఉన్నప్పుడు వినియోగదారులు కాన్ఫిగరేషన్ ప్రొఫైల్‌లను ఇన్‌స్టాల్ చేయలేరు మరియు మొబైల్ డివైస్ మోడ్ (MDM)లో నమోదు చేయలేరు.

Best Mobiles in India

English summary
Apple Brand Planning to Bring New iPad With OLED Screen!! Launch Date, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X