యాపిల్ చేతికి హైదరాబాద్ కంపెనీ

|

యూఎస్ టెక్ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ స్టార్టప్ Tuplejumpను కొనుగోల చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.

యాపిల్ చేతికి హైదరాబాద్ కంపెనీ

Read More : జియోకు కౌంటర్ : 90 రోజుల ప్లాన్‌తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

మెషీన్ ఆధారిత లెర్నింగ్ సేవలను అందించే Tuplejump ప్రముఖ కంపెనీలకు ఓ ప్రత్యేకమైన డేటా ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌‌వేర్ ద్వారా డేటా విజువలైజేషన్, స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి విధులను మరింత సులభతరంగా నిర్వహించుకోవచ్చు.

ఇద్దరు స్థాపించారు...

ఇద్దరు స్థాపించారు...

Tuplejump కంపెనీని రోహిత్ రాయ్, బుద్దవరపు సత్యప్రకాష్ లు 2013లో ప్రారంభించారు. దీపక్ అలుర్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

మెచీన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌ను ..

మెచీన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌ను ..

మెచీన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్‌ను మరింత విప్లవాత్మకం చేసేందుకు ఈ సంస్థ అభివృద్థి చేస్తోన్న "FiloDB" అనే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యాపిల్‌ను ఎంతగానో ఆకర్షించినట్లు తెలుస్తోంది.

ఓపెన్ సోర్స్ బిగ్ డేటా టూల్స్ అయిన

ఓపెన్ సోర్స్ బిగ్ డేటా టూల్స్ అయిన

అంతేకాకుండా ఓపెన్ సోర్స్ బిగ్ డేటా టూల్స్ అయిన అపాచీ స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, అపాచీ కసాండ్రా, NoSQL database వంటి అంశాల్లో Tuplejump కంపెనీకి అపారమైన అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్న టెక్ కంపెనీలను ఒక్కొక్కటిగా

చిన్న టెక్ కంపెనీలను ఒక్కొక్కటిగా

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని యాపిల్ డీల్ ఓకే చేసినట్లు సమాచారం. వ్యాపార విస్తరణలో భాగంగా యాపిల్ చిన్న టెక్ కంపెనీలను ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

మ్యాప్స్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌

మ్యాప్స్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌

భారత పర్యటనలో భాగంగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌కు విచ్చేసిన యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ తమ మ్యాప్స్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌ లో ప్రారంభించిన విషయం తెలిసిందే.

యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్

యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్

యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్ ఇంకా యాపిల్ వాచ్‌లకు సంబంధించిన మ్యాప్‌లను ఈ సెంటర్‌లో అభివృద్థి చేస్తున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు.

 

 

Best Mobiles in India

English summary
Apple Buys Hyderabad-Based Machine Learning Startup Tuplejump. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X