'స్టీవ్ జాబ్స్' మెమొరియల్ వీడియో ఇంటర్నెట్లో..

By Super
|
Steve Jobs
ప్రపంచంలో అనతి కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్. తన ఉత్పత్తులతో యావత్ ప్రపంచాన్ని ఊగిసలాడించిన యాపిల్ కంపెనీ సహా వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ నెల మొదటి వారంలో చనిపోయిన విషయం తెలిసిందే. అతని జ్ఞాపకార్దం యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ జీవితానికి సంబంధించిన జీవిత విశేషాలతో ఓ వీడియోని రూపొందించడం జరిగింది.

'సెలబ్రేటింగ్ స్టీవ్' అనే పేరుతో రూపొందించిన 80నిమిషాలు నిడివి కలిగిన పెద్ద వీడియోని అక్టోబర్ 19(బుధవారం) రోజున కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్ కుపర్టినోలో జరిగిన స్టీవ్ జాబ్స్ నివాళులు కార్యక్రమంలో విడుదల చేసారు. ఈ సందర్బంలో బోర్డ్ మెంబర్ ఏఐ గోరి ఆద్వర్యంలో సింగర్ నారా జోన్స్(స్టీవ్ జాబ్స్ స్నేహితుడు) అద్బుతమైన సంగీతాన్ని ఆలపిస్తూ యావత్ యాపిల్ ఉద్యోగులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంలో యాపిల్ ప్రస్తుత సిఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్స్ అన్ని కూడా మూడు గంటలు పాటు మూసివేయడం జరుగుతుంది. అంతేకాకుండా యాపిల్ స్టోర్స్‌లలో పని చేసే ఉద్యోగులకు ముందుగానే కిటికీలకు తెల్లని షీట్స్ కట్టవలసిందిగా ఆదేశించారు.

 

కుపెర్టినోలో ఉన్నయాపిల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ మొత్తానికి స్టీవ్ జాబ్స్ ఫోటోలను వ్రేలాడదీయడం జరిగింది. ఒక ప్రక్క యాపిల్ ఉద్యోగులు ఘననివాళులు సమర్పిస్తుంటే, అదే సమయంలో కుపెర్టినో నగర ప్రజలు కూడా స్టీవ్ జాబ్స్ ప్రపంచానికి చేసిన సేవలకు గాను శ్రద్దాంజలి ఘటించి, స్టీవ్ జాబ్స్ జీవితం గురించిన చిన్న వీడియోని బ్లాగులో పోస్ట్ చేసారు. ఈ వీడియోని గనుక వన్ ఇండియా పాఠకులు వీక్షించాలని అనుకుంటే యాపిల్ వెబ్ సైట్ లింక్(http://events.apple.com.edgesuite.net/10oiuhfvojb23/event/index.html)ని క్లిక్ చేయాల్సి ఉంటుంది.

 

టెక్నాలజీ రంగంలో అత్యుత్తమమైన సేవలను అందించిన స్టీవ్ జాబ్స్ కొసం అక్టోబర్ 16వ రోజని కాలిఫోర్నియా రాష్ట్రం 'స్టీవ్ జాబ్స్ డే' గా ప్రకటించడం జరిగింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X