ఫేస్‌‌బుక్ ప్రైవసీ స్కాండల్, ఘాటుగా స్పందించిన ఆపిల్ సీఈఓ

|

కేంబ్రిడ్జి ఎనాలిటికా ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలా లేవు. దీని వలలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. టెక్ దిగ్గజాలు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని దీనిపై కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఈ విషయం మీద కొంచెం ఘాటుగా స్పందించారు. ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ ఉదంతం..యూజర్ల డేటా విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలని మళ్ళీ హెచ్చరిస్తోందని ఆపిల్‌ సిఇఒ టిమ్‌ కుక్‌ అన్నారు. ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు ఇలాంటి వివాదాల్లో ఉండటం విచారకమన్నారు.

 

ఆపిల్ నుంచి అదిరే ఫీచర్లతో ఐప్యాడ్, ధర రూ. 28 వేలు మాత్రమేఆపిల్ నుంచి అదిరే ఫీచర్లతో ఐప్యాడ్, ధర రూ. 28 వేలు మాత్రమే

చైనా డెవలప్మెంట్ ఫోరంలో..

చైనా డెవలప్మెంట్ ఫోరంలో..

చైనా డెవలప్మెంట్ ఫోరంలో అమెరికా, చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలపై ప్రసగించిన ఆయన ఫేస్‌బుక్‌ యూజర్ డేటా ఉల్లంఘన కుంభకోణంపై స్పందించారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఈ ఉదంతం యూజర‍్ల డేటాభద్రతపై రెగ్యులేటరీ తీసుకోవాల్సిన కఠిన నిబంధనలను మరోసారి గుర్తు చేసిందన్నారు.

ఫేస్‌బుక్‌ లాంటి సంస్థ ..

ఫేస్‌బుక్‌ లాంటి సంస్థ ..

అదీ ఫేస్‌బుక్‌ లాంటి సంస్థ ఇలాంటి వివాదాల్లో ముందువరసలో ఉండటం మరింత విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్‌లో 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌పై ప్రశ్నించినపుడు కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం చాలా భయంకరమైందనీ కుక్‌ వ్యాఖ్యానించారు.

ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు ..
 

ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు ..

ఇలాంటి పరిస్థితుల్లో ఆపిల్ వినియోగ దారుల గోప్యతకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు. యూజర్లు ఏం చేస్తున్నారనేది ఇతరులకు తెలియడం ప్రమాదకరమన్నారు.ఈ వివాదం యూజర్ డేటా రక్షణపై రూపొందించాల్సిన కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కి చెప్పిందన్నారు.

యూజర్లు

యూజర్లు

యూజర్లు అనేక సంవత్సరాలుగా ఏమి బ్రౌజ్ చేస్తున్నారు, వారి స్నేహితుల జాబితా, మళ్లీ ఆ స్నేహితుల లిస్ట్‌లోని వారి పరిచయాలు, లైక్స్‌, డిస్‌లైక్స్‌ ..ఇలా వ్యక్తుల జీవితాల్లోని అత్యంత కీలకమైన అంశాలు వేరే వ్యక్తుల చేతుల్లోకి పోకూడదన్నారు. వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకూడదని కుక్‌ అభిప్రాయపడ్డారు.

గతకొన్ని సంవత్సరాలుగా

గతకొన్ని సంవత్సరాలుగా

గతకొన్ని సంవత్సరాలుగా చాలాదేశాల్లో డేటా ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేపుతోందన్నారు. కాగా యూజర్ల సమాచారం విక్రయానికి గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే టాప్‌సంస్థలు తీవ్రంగా స్పందించడం ఫేస్‌బుక్‌ కు ప్రతికూల అంశం.

ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు..

ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు..

ముఖ్యంగా వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ ఆక్టన్‌ డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమం, ఫేస్‌బుక్‌ పేజీలను డిలీట్‌ చేస్తున్నట్టు స్సేస్‌ ఎక్స్‌ అధిపతి ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం మరింత ఆందోళన రేపింది. అలాగే బాలీవుడ్ లోని ఓ హీరో కూడా తన అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నారని ప్రకటించారు. తాజాగా ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు, వెలిబుచ్చిన ఆందోళన ఫేస్‌బుక్‌పై ఒత్తిడిని తీవ్రం చేసింది.

Best Mobiles in India

English summary
Apple's CEO Tim Cook Speaks Up About Facebook's Privacy Scandal More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X