Home
News

Foldable Iphone ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఐఫోన్లు.. ఈ సంస్థలకు గట్టిపోటీ.. పూర్తి వివరాలు??

ఆపిల్‌ తొలి మిక్సడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ విజన్‌ ప్రో ఇటీవల అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను (Apple Foldable iphone) తయారు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. కనీసం రెండు ప్రోటోటైప్‌ ఫోన్లను అభివృద్ధి చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు గెలాక్సీ Z Flip 5 స్మార్ట్‌ఫోన్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రోటోటైప్‌ డిజైన్‌ పై సంస్థ సంతృప్తి చెందాకా ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

apple-working-on-clamshell-prototype-foldable-iphones

కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు (Apple clamshell prototype Foldable iphones) తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్‌ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది.

ఐఫోన్‌ ఫోల్డబుల్‌ డివైస్‌లకు అవుటర్‌ డిస్‌ప్లే కలిగి ఉండాలని, ఫోల్డింగ్‌ చేసినప్పుడు కనిపించేలా ఉండాలని ఆపిల్‌ తన ఇంజినీర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిజైన్‌ త్వరగా బ్రేక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ఐఫోన్ల మాదిరిగా సన్నగా ఉండేలా డిజైన్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.

apple-working-on-clamshell-prototype-foldable-iphones

విడిభాగాల కోసం కీలక ప్రయత్నాలు? : అయితే ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌.. బ్యాటరీ, డిస్‌ప్లే విడిభాగాల కారణంగా కొంచెం మందంగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్‌ సంస్థ ఈ రెండు ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్ల (Apple Working On Foldable iPhones) విడిభాగాల కోసం ఆసియాలోని విడిభాగాల సరఫరాదారుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్లతోపాటు ఫోల్డబుల్‌ ఐప్యాడ్‌ను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ఐప్యాడ్‌ ప్రస్తుతం ఉన్న ఐప్యాడ్‌ మిని తరహా 8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆపిల్‌ సంస్థ ఇంజినీర్లు ఫోల్డబుల్‌ ఐఫోన్లను మడిచినప్పుడు మధ్యలో కనిపించే క్రీజ్‌ను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌ విడుదలకు సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం శాంసంగ్‌ ఈ ఫో‌ల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో రాణిస్తోంది. వన్‌ప్లస్‌, షియోమీ, వివో, ఒప్పో సంస్థలు కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేశాయి. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip 5, మోటోరోలా రేజర్‌ 40 అల్ట్రా, ఒప్పో ఫైండ్‌ N3 Flip మరియు టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ 5G స్మార్ట్‌ఫోన్లతో ఆపిల్‌ పోటీ పడే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple clamshell prototype Foldable iphones under development
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X