ఆపిల్ కొత్త సర్వీసు 17 దేశాలకు మాత్రమే

Posted By:

ఆపిల్ కొత్త సర్వీసు 17 దేశాలకు మాత్రమే

 

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ గ్లోబల్ విస్తరణలో భాగంగా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న ఐట్యూన్స్ మ్యాచ్, ఐట్యూన్స్ క్లౌడ్ సర్వీస్‌లను ఏయే దేశాలు సపోర్ట్ చేయనున్నాయో ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఆపిల్ 17 దేశాలకు ఐట్యూన్స్ సర్వీసులను అందించనున్నామని తెలిపింది. పాఠకుల కోసం ప్రత్యేకంగా ఆయా దేశాల వివరాలు..

ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ప్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, లుక్సంబర్గ్, మాల్టా, మెక్సికో, న్యూజిల్యాండ్, స్లోకోవియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్.

ఆపిల్ విడుదల చేసిన ఈ దేశాల లిస్ట్‌లో చాలా దేశాలు లేకపోయినప్పటికీ, ముఖ్యంగా బ్రెజిల్‌కి 'ఐట్యూన్స్ అప్ గ్రేడ్' సర్వీస్‌ని అందించారు. ప్రస్తుతానికి ఆసియా దేశాలకు మాత్రం ఎటువంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం లేదని ఆపిల్ అధికారులు తెలిపారు. క్లౌడ్ ఆధారిత సేవలను బట్టి, ఆపిల్ ఐట్యూన్స్‌ని విడుదల చేయనుంది. ఇలా సర్వీసులను గ్లోబల్‌గా విస్తరించడం వల్ల ఎవరైనా కస్టమర్ ఐట్యూన్స్‌తో పాటు ఆపిల్ స్టోర్ నుండి ఏమైనా సమాచారం డౌన్ లోడ్ చేసుకుంటే ఆ సమాచారం మొత్తాన్ని వేరే ఇతర ఆపిల్ డివైజ్‌లకు ప్రీగా షేర్ చేసుకోవచ్చు.

ఆస్టేలియా, కెనడా, యుకె, అమెరికాలో ఉన్న కస్టమర్స్ ఆపిల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త సర్వీసులు తమకెంతో నచ్చాయని తెలిపారు. ప్రపంచంలో మిగిలిన 120 దేశాలకు సంబంధించిన ఆపిల్ కస్టమర్స్‌కి తక్కువ సర్వీసులను అందిస్తుండగా, త్వరలోనే వారికి కూడా ఈ సర్వీసులను అందిచనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot