Home
News

iPhone 12 Mini ఉత్పత్తిని తగ్గించే పనిలో ఆపిల్ కంపెనీ!! కారణం ఇదే...

ప్రముఖ యుఎస్ టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ఐఫోన్ 12 మినీ ఫోన్ ను విడుదల చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే సంస్థ యొక్క అంచనాల ప్రకారం ఈ ఆపిల్ ఐఫోన్ 12 మినీ పని చేయడం లేదు అని వివిధ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దీని కారణంగా ఐఫోన్ 12 ప్రొడక్షన్ ను ఆపిల్ సంస్థ మొత్తంగా మరొక 20 శాతం తగ్గిస్తుందని కొత్త నివేదిక పేర్కొంది. ఈ ప్రొడెక్షన్ తగ్గింపులో ప్రధానంగా ఐఫోన్ 12 మినీ మరింత ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ 12 సిరీస్ ప్రొడెక్షన్ తగ్గింపు

ఐఫోన్ 12 సిరీస్ ప్రొడెక్షన్ తగ్గింపు

2021 మొదటి ఆరు నెలల్లో ఆపిల్ కొత్త ఐఫోన్ 12 సిరీస్ మరియు పాత ఫోన్‌లను కలుపుకొని మొత్తంగా 75 మిలియన్ ఐఫోన్‌లను కంపెనీ ఉత్పత్తి చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే ప్రస్తుతం ఆపిల్ యొక్క ఉత్పత్తులు మునుపటి అంచనాల కంటే 96 మిలియన్ల తక్కువగా ఉన్నప్పటికి 2020 మొదటి సగం సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. మొత్తంమీద యుఎస్‌లో ఐఫోన్ 12 సిరీస్ అమ్మకాలు ఐఫోన్ 11 సిరీస్‌ను అధిగమించాయి. వీటిలో బేస్ ఐఫోన్ 12 వేరియంట్ అధికంగా అమ్ముడయ్యాయి. అలాగే ప్రో మరియు ప్రో మాక్స్ కూడా గత సంవత్సరం ప్రో సిరీస్‌ను ఓడించాయి. రెండు ప్రో మోడళ్ల కోసం ఆర్డర్‌లను మరింత పెంచినట్లు కంపెనీ తెలిపింది. 2021 క్యూ 1లో ఐఫోన్ 12 సిరీస్ 111.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది.

ఆపిల్ మాక్‌బుక్‌ల కొత్త ప్రయోగం

ఆపిల్ మాక్‌బుక్‌ల కొత్త ప్రయోగం

ఆపిల్ సంస్థ యొక్క కొత్త ఐఫోన్ 12 సిరీస్ తయారీని తగ్గించడంతో పాటుగా మే లేదా జూన్ నెల‌లో రెండు కొత్త మాక్‌బుక్‌ల యొక్క ప్రొడెక్షన్ ను భారీగా ప్రారంభించాలని కంపెనీ చూస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ కొత్త మాక్‌బుక్స్‌లు మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు మరియు కంపెనీ సొంత సిలికాన్ వంటి సరికొత్త టెక్నాలజీలను కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ఐఫోన్ 12 మినీ యొక్క అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ ఆపిల్ సంస్థ ఈ సంవత్సరం ఐఫోన్ 13 మినీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త కాంపాక్ట్ ఐఫోన్ అమ్మకాలను పెంచడంలో సహాయపడటానికి కంపెనీ ఈ ఏడాది చివర్లో SE వేరియంట్‌ను విడుదల చేయకపోవచ్చు.

ఇండియాలో ఐఫోన్ 12 తయారీ

ఇండియాలో ఐఫోన్ 12 తయారీ

ఆపిల్ సంస్థ యొక్క ఇతర వార్తల విషయానికి వస్తే ఇండియాలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌ను స్థానికంగా తయారు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ మీడియా సమావేశంలో తెలిపింది. కొన్ని నివేదికల ప్రకారం "మా స్థానిక వినియోగదారుల కోసం భారతదేశంలో ఐఫోన్ 12 ఉత్పత్తిని ప్రారంభించినందుకు మేము గర్విస్తున్నాము" అని కంపెనీ తెలిపింది. ఆపిల్ కంపెనీ ఇప్పటికే దేశంలో ఐఫోన్ SE, ఐఫోన్ XR మరియు ఐఫోన్ 11 లను తయారు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Company Cuts iPhone 12 Mini Production due to Performance issues
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X