మ్యూజిక్ సర్వీస్ కోసం సోనీతో డీల్ ఓకే చేసిన ఆపిల్ కంపెనీ

Posted By: Super

మ్యూజిక్ సర్వీస్ కోసం సోనీతో డీల్ ఓకే చేసిన ఆపిల్ కంపెనీ

త్వరలో ఆపిల్ అభిమానులకు మరో క్రొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఏంటా ఆ క్రొత్త ఫీచర్ అని అనుకుంటున్నారా... క్లౌడ్ మ్యూజిక్ సర్వీస్ కోసం ఆపిల్ కంపెనీ సోనీతో ఓ సరిక్రోత్త డీల్‌ని కుదుర్చుకుంది. గతంలో కూడా ఆపిల్ కంపెనీ మ్యూజిక్ సర్వీస్ కోసం వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఆపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఐఫోన్స్, టాబ్లెట్స్‌లలో మ్యూజిక్ సులభతరం చేయడం కోసమేనని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

గూగుల్, అమెజాన్ కంపెనీలు గతంలో ఈ క్లౌడ్ మ్యూజిక్ సర్వీస్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆపిల్ ఐటూన్స్ మాదిరి కాకుండా గూగుల్, అమెజాన్ కంపెనీలకు సంబంధించినటువంటి క్లౌడ్ మ్యూజిక్ సర్వీస్‌లలో ఎక్కువ శాతం విదేశీ లైసెన్సింగ్ డీల్స్ ఎక్కువగా ఉండడం గమనార్హం.. ఇప్పుడిప్పుడు మొదలవుతున్నటువంటి ఈ వార్‌లో చివరకి ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot