Just In
- 5 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 6 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 8 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 8 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- News
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసు
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Apple iPad Airను ఉచితంగా రిపేర్ చేసుకోవడానికి మంచి సమయం ఇదే
ఆపిల్ సంస్థ ఇప్పుడు 2019 సంవత్సరంలో విడుదల చేసిన తన మూడవ తరం ఐప్యాడ్ ఎయిర్ మోడళ్ల కోసం ఉచిత మరమ్మత్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఐప్యాడ్ యొక్క డిస్ప్లే పూర్తిగా నిలిపివేయబడి ఉన్న మరియు "బ్లాంక్ స్క్రీన్ సమస్య" తో బాధపడుతున్న ఐప్యాడ్ ఎయిర్ మోడళ్లను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా రిపేర్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

పరిమిత కాల సమయం వరకు మాత్రమే ఆపిల్ 3 వ తరం ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ "బ్లాంక్ స్క్రీన్" మరమ్మత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆపిల్ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. డిస్ప్లే శాశ్వతంగా బ్లాంక్ స్క్రీన్ గా ఉండకముందే ప్రభావితమైన ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ "క్లుప్త ఫ్లికర్ లేదా ఫ్లాష్" ను చూపుతాయని ఆపిల్ వివరిస్తుంది. అలాగే మార్చి 2019 మరియు అక్టోబర్ 2019 మధ్య తయారైన ఐప్యాడ్ ఎయిర్ మోడళ్ల కోసం మాత్రమే ఉచితంగా రిపేర్ ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

బ్లాంక్ స్క్రీన్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఐప్యాడ్ ఎయిర్ వినియోగదారులు తమ పరికరాలను అధికారిక ఆపిల్ సర్వీసు ప్రొవైడర్ల వద్ద ఉచితంగా పరిష్కరించుకోవచ్చు. వినియోగదారులు ఆపిల్ రిటైల్ దుకాణంలో అపాయింట్‌మెంట్ పొందవచ్చు లేదా ఇమెయిల్ ద్వారా ఆపిల్ సపోర్ట్‌ను సంప్రదించవచ్చు. భారతదేశంలో ఆపిల్ వినియోగదారులు తమ ప్రభావిత ఐప్యాడ్ ఎయిర్ మరమ్మతులను చేయించుకోవడానికి ఆపిల్ అధికారిక విక్రేతల వద్దకు వెళ్ళవచ్చు.
Netflix Autoplay ఫీచర్ ఎట్టకేలకు తీసివేశారు

మరమ్మత్తు ప్రోగ్రామ్
మరమ్మతు కోసం ఐప్యాడ్‌ను అప్పగించే ముందు వినియోగదారులు తమ డేటాను బ్యాకప్ చేయాలని ఆపిల్ సంస్థ సలహా ఇస్తుంది. అలాగే ఈ మరమ్మత్తు ప్రోగ్రామ్ లో పగిలిన డిస్ప్లే లు మరియు ధృవీకరించబడని సమస్యకు వెలుపలి నష్టాలను కవర్ చేయదు. ఇటువంటి మరమ్మతులకు వినియోగదారులు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఐప్యాడ్ ఎయిర్ రిపేర్ ప్రోగ్రామ్ పరికరం యొక్క మొదటి అమ్మకం తర్వాత రెండు సంవత్సరాల వరకు చెల్లుతుంది.
PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?

2019 లో దాదాపు ఐదేళ్ల తర్వాత ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 3 వ తరం ఐప్యాడ్ ఎయిర్ 10.5-అంగుళాల రెటినా డిస్ప్లే, ఎ 12 బయోనిక్ చిప్‌సెట్ మరియు ఆపిల్ పెన్సిల్‌కు మద్దతుతో వస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఐప్యాడ్ ఎయిర్ కోసం సెల్యులార్ మరియు వై-ఫై మాత్రమే వెర్షన్ ఉంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190