ఆపిల్ సవాల్,ఐఫోన్లో బగ్ కనిపెడితే 1 మిల్లియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ

By Gizbot Bureau
|

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ హ్యాకర్లకు సవాల్ విసిరింది. మ్యాక్ బగ్ బౌంటీ కాంటెస్ట్ ద్వారా ఐఫోన్ హ్యాక్ చేసినవారికి కంపెనీ భారీ బహుమతిని ప్రకటించింది. సైబర్‌ నేరాలు, హ్యాకింగ్‌కు అవకాశం కల్పించే లోపాల్ని గుర్తించిన వారికి ఒక మిలియన్‌ డాలర్లను బహుమానంగా అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొడుతున్నాయని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆపిల్ సవాల్,ఐఫోన్లో బగ్ కనిపెడితే 1 మిల్లియన్ డాలర్ల ఫ్రైజ్ మనీ

 

గతంలో కొంత మంది నిర్దేశిత పరిశోధకులకు మాత్రమే ఈ బహుమతి అందించేవారు. కానీ, ఇక నుంచి లోపాల్ని కనుగొనే ప్రక్రియను అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచనున్నట్లు లాస్‌వెగాస్‌లో జరిగిన బ్లాక్‌ హ్యాట్‌ సెక్యూరిటీ సదస్సులో ఆపిల్‌ ప్రకటించింది.

వాచ్ఓఎస్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్

వాచ్ఓఎస్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్

ఇప్పటివరకూ ఏ టెక్ కంపెనీ కూడా అత్యధిక బగ్ బౌంటీని ఆఫర్ చేయలేదు. ఆఫర్ చేయడమే కాకుండా ఐఫోన్, మ్యాక్ సిస్టమ్ లో భద్రత లోపాలను గుర్తించినవారికి ఇచ్చే రివార్డును అమాంతం పెంచేసింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆపిల్ కూడా ఓ మ్యాక్ బగ్ బౌంటీని లాంచ్ చేయనున్నట్టు ధ్రువీకరించింది. ఐఫోన్‌తో పాటు మ్యాక్ సాఫ్ట్‌వేర్‌, ఇతర యాపిల్‌ ఉత్పత్తుల్లో హ్యాకింగ్‌ అవకాశం కల్పించే లోపాల్ని కనుగొన్న వారికి ఈ బహుమానం లభిస్తుందని తెలిపింది.

ఎటువంటి అనుమతి తీసుకోకుండా

ఎటువంటి అనుమతి తీసుకోకుండా

ఈ బహుమతిని వారు బౌంటీలుగా పేర్కొన్నారు. అయితే వినియోగదారుడి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఫోన్‌లోకి ప్రవేశించే లోపాలను కనుగొన్న వారికి మాత్రమే ఈ బహుమానం వర్తిస్తుందని వెల్లడించింది. ఇప్పటివరకు చిన్నపాటి బగ్స్‌ కనుగొన్నవారికి ఆపిల్‌ 20వేల డాలర్లు అందిస్తూ వచ్చింది. సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్న తరుణంలో ఆపిల్‌ పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

హ్యాకర్లకు అనుకూలించే లోపాలు పసిగట్టే అవకాశం
 

హ్యాకర్లకు అనుకూలించే లోపాలు పసిగట్టే అవకాశం

అలాగే లోపాల్ని పరిశోధించే ప్రక్రియల్ని సైతం సులభతరం చేస్తోంది. అందులో భాగంగా భద్రతా ప్రమాణాల్ని తొలగించిన ఫోన్లను పరిశోధకులకు అందజేస్తోంది. దీని ద్వారా హ్యాకర్లకు అనుకూలించే లోపాల్ని పసిగట్టే అవకాశం ఏర్పడుతుంది. సంస్థ ప్రొడక్ట్స్‌లో లోపాల్ని పరిశోధించే ప్రక్రియలను సైతం ఈజీ చేస్తోంది ఆపిల్ కంపెనీ. ఆ నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు తొలగించిన ఐ ఫోన్లను పరిశోధకులకు అందిస్తోంది. దాంతో హ్యాకర్లకు అనుకూలించే లోపాలు పసిగట్టే అవకాశం ఏర్పడుతుందనేది ఒక అంచనా. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఆయా దేశాలు సరికొత్త టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. అదే క్రమంలో ఆపిల్ సంస్థ ఇలాంటి చర్యలు తీసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

పెద్ద మొత్తం సొంతం కావాలంటే

పెద్ద మొత్తం సొంతం కావాలంటే

అయితే ఇంత పెద్ద మొత్తం సొంతం కావాలంటే.. ఐఫోన్‌తో పాటు మ్యాక్ సాఫ్ట్‌వేర్‌, ఇతర యాపిల్‌ ఉత్పత్తుల్లో హ్యాకింగ్‌ అవకాశం కల్పించే లోపాల్ని కనుగొనాల్సి ఉంటుంది. దీంతో పాటు కోర్ ఆఫ్ iOS కెర్నల్ గుర్తించి హ్యాక్ చేసిన రీసెర్చర్లకు పది లక్షల రూపాయల రివార్డు అందుతుంది. ఐఫోన్ ఓనర్ జీరో క్లిక్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే రివార్డు అందుతుంది. మరో రివార్డు 5 లక్షల డాలర్లు పొందాలంటే.. ‘నెట్ వర్క్ ఎటాక్ రిక్వైరింగ్ నో యూజర్ ఇంటరాక్షన్' గుర్తించాలి. సాఫ్ట్ వేర్ రిలీజ్ కు ముందుగానే అందులోని బలహీనతను గుర్తించిన హ్యాకర్లకు 50 శాతం బోనస్ కూడా ఆపిల్ అందించనుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple Confirms $1 Million Reward For Anyone Who Can Hack An iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X