ట్విట్టర్ పై ఆపిల్ కన్ను?

Posted By: Prashanth

ట్విట్టర్ పై ఆపిల్ కన్ను?

 

న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌తో, ఆపిల్ చర్చలు సాగించినట్లు దిన్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ చర్చల్లో భాగంగా ట్విట్టర్‌లో పెట్టబుడులు పెట్టేందుకు ఆపిల్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పెట్టబుడలు ద్వారా ట్విట్టర్ విలువ 840 కోట్ల డాలర్ల నుంచి వెయ్యి కోట్ట డాలర్టకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 14 కోట్టకు పై మాటే. కంపెనీ చేతిలో ఇప్పటికే 60కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. నేపథ్యంలో ట్విట్టర్‌కు యాపిల్ పెట్టుబడి అవసరం ఇప్పటికైతే లేదని అంటున్నారు.

‘ఐఫోన్ 5’ విడుదలెప్పుడు?

అభిమానుల ఎదురుచూపులు మరింత వెనక్కివెళ్లేలా కనిపిస్తున్నాయి.. యావత్ ప్రపంచాన్ని ఊరిస్తున్న సరికొత్త ‘ఆపిల్ ఐఫోన్ 5’ విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. అగష్టు 7న అంగరంగ వైభవంగా ఐఫోన్5ను ఆవిష్కరించనున్నారంటూ నిన్నమొన్నటి వరకు హల్‌చల్ చేసిన పుకార్లు తాజాగా వెల్లడైన సమాచారంతో వొట్టివని తేలిపోయింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ ఆపిల్ ఐఫోన్5ను సెప్గంబర్ 21న లాంచ్ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot