Home
News

ఆపిల్ అక్టోబర్ ఈవెంట్‌ 2025.. M5 చిప్‌సెట్‌తో మ్యాక్‌బుక్‌ ప్రో, విజన్‌ ప్రో, ఐప్యాడ్ ప్రో..!

ఆపిల్‌ నుంచి ఈ అక్టోబర్‌ లో కీలక ఉత్పత్తులపై ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాలో అనేక ఉత్పత్తులు ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్‌ మార్క్ గుర్మన్‌ రిపోర్టు ఆధారంగా M5 చిప్‌సెట్‌ తో ఆపిల్ మూడు డివైజ్‌లను విడుదల చేయనుంది. ఫలితంగా M4 చిప్‌సెట్‌ తో పోలిస్తే CPU, GPU పనితీరు పరంగా గణనీయ పెరుగుదల కనిపిస్తుంది. ఇందులో ఐప్యాడ్‌ ప్రో M5, విజన్‌ ప్రో M5, మ్యాక్‌బుక్‌ ప్రో M5 ఉన్నాయి.

ఐప్యాడ్ ప్రో M5 :
ఆపిల్ ఈ నెల చివర్లో విడుదల చేయనుందని భావిస్తున్న ఉత్పత్తుల్లో ఐప్యాడ్ ప్రో M5 (Apple iPad Pro M5) ఉండనుందని తెలుస్తోంది. లీక్స్‌ సహా ఇతర మార్గాల్లో అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ కొత్త ఐప్యా్‌డ్‌ ప్రో స్లీక్‌ డిజైన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Apple could launch Macbook Pro M5  iPad Pro M5  Vision Pro M5 in october 2025 news

ఐప్యాడ్ ప్రో మోడల్‌ ఈసారి M5 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌ తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. M4 చిప్‌సెట్‌ తో పోలిస్తే M5 చిప్‌.. CPU పనితీరు పరంగా 12 శాతం మెరుగుదల, అదే GPU పరంగా 36 శాతం మెరుగైన పనితీరును పొందవచ్చు.

ఆపిల్ ఐప్యాడ్‌ ప్రో M5 మోడల్‌ ముందు వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా వీడియో కాలింగ్‌ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

మ్యాక్‌బుక్ ప్రో M5 :
ఈ అక్టోబర్‌ లో M5 చిప్‌ తో కూడిన మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్‌ (Apple Macbook Pro M5) విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్ 14 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. పనితీరు పరంగా గత మోడల్స్‌ తో పోలిస్తే గణనీయమైన వృద్ధిని పొందవచ్చని తెలుస్తోంది.

ఆపిల్‌ మ్యాక్‌బుక్ ప్రో M5 డిజైన్ పరంగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో మోడల్‌ ఈ నెలలోనే ఆవిష్కరించినా, 2026 లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Apple could launch Macbook Pro M5  iPad Pro M5  Vision Pro M5 in october 2025 news

విజన్‌ ప్రో M5 :
ఈసారి విజన్‌ ప్రో మోడల్‌ (Apple Vision Pro M5) M5 చిప్‌, R2 చిప్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా గ్రాఫిక్స్‌, ప్రాసెసర్‌ పరంగా మెరుగైన పనితీరును పొందే అవకాశం ఉంది. ప్రీమియం యూజర్ల కోసం కొత్తగా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఆపిల్ A17 ప్రో చిప్‌ తో కూడిన ఆపిల్ టీవీ లో ఫీచర్ల పరంగా మార్పులను గమనించే అవకాశం ఉంది. Homepad mini S9 చిప్‌, కొత్త కలర్‌ వేరియంట్‌ లో లభించే అవకాశం ఉంది. AirTag 2 ట్రాకింగ్‌ రేంజ్ పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple could launch Macbook Pro M5, iPad Pro M5, Vision Pro M5 in october 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X