సునామీ వల్ల జపాన్‌లో వెనుకంజ వేసిన ఆపిల్ ఐప్యాడ్ 2

By Super
|
Apple iPad
ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఐపాడ్ 2ని పోయిన వారం అమెరికాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే దీనిని జపాన్‌లో కూడా విడుదల చేయాలని ఆపిల్ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వెనక్కి వేసుకున్నారు. దీనికి కారణం జపాన్‌లో సంభవించినటువంటి భూకంపం మరియు అక్కడ వచ్చినటువంటి సునామీనే కారణం అని అంటున్నారు. దీంతో ఆపిల్ ఐపాడ్ 2ని జపాన్‌లో విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం ఇంకోంత కాలం వాయిదా వేసుకున్నారు.

మార్చి 2న ఆపిల్ కంపెనీ ఛీప్ స్టీవ్ జాబ్స్ చేతుల మీదగా అమెరికాలో విడుదలైంది. ఆతర్వాత దానిని మార్చి 25వ తారీఖున జపాన్‌లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆతర్వాత జపాన్‌లో సునామీ రావడం అక్కడ పరిస్ధితులు ఒక్కసారిగా తారుమారు కావడం అందరికి తెలిసిన విషయమే. ఈసందర్బంలో కంపెనీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం జపాన్‌లో జరిగినటువంటి సునామీ బాధితులకు సంబంధించినటువంటి సహాయక చర్య లు చేపడుతున్నామని తెలిపారు.

ఐతే ఒక్క జపాన్‌ని వదిలివేసి 26 దేశాలలో ఆపిల్ ఐప్యాడ్ 2ని మార్చి 25న విడుదల చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మెక్సికో, న్యూజిల్యాండ్, స్పెయిన్‌లో ఆపిల్ కంపెనీకి మంచి అభిమానులు ఉండడంతో అక్కడ విడుదల చేస్తున్నామన్నారు. పుకిషిమా నగరంలో అణు రియాక్టర్‌లో సంభంవించినటువంటి పేలుళ్శ వల్ల ఆపిల్ కంపెనీ ఉద్యోగులు అందులో చిక్కుకున్నారని అన్నారు. అది మాత్రమే కాకుండా అణు రియాక్టర్ నుండి వెలువడే రేడియోధార్మికతకు అక్కడి ప్రభుత్వం ఎవరిని బయటకు రానివ్వకుండా చేపట్టినటువంటి పనులు హార్షణీయం అని అన్నారు.

ఇది మాత్రమే కాకుండా జపాన్ భూకంపంలో సర్వం కోల్పోయినటువంటి ఆపిల్ కంపెనీ ఉద్యోగులు మరియు అక్కడున్నటువంటి ప్రజల సెల్ ఫోన్స్ కి రిచార్జ్ ఉచితంగా, లాప్ టాప్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు. దీనివలన వారు ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకోవడానికి ఒక సదవకాశంగా ఉంటుందని తెలిపారు. జపాన్ సంభవంచినటువంటి ఈభూకంపం వల్ల ఆపిల్ కంపెనీకి దాదాపు 563 మిలియన్ డాలర్లు నష్టం కలిగిందని అన్నారు. పోయిన సంవత్సరం జపాన్ మీద ఆపిల్ ఆదాయం 4 బిలియన్స్ డాలర్లని వివరించారు. అంటే ఆపిల్ కంపెనీ సంవత్సర ఆదాయంలో 6.1శాతం అన్నమాట.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X