కొత్త ఫోన్ల రాకతో, మూడు iPhone మోడళ్ళు నిలిపివేశారు ! వివరాలు చూడండి.

By Maheswara
|

Apple గత రాత్రి కొత్త ఐఫోన్‌ సిరీస్ లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి iPhone 14 సిరీస్ గా వస్తాయి వీటిలో 4 కొత్త మోడల్‌లు ఉన్నాయి.ఈ కొత్త ఫోన్ల లాంచ్ తర్వాత Apple యొక్క మూడు పాత ఐఫోన్ మోడల్‌లను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంటే Apple ఈ 3 iPhoneలను నిలిపివేస్తోంది అంటే ఆ మూడు మోడళ్లను మీరు ఇక కొనలేరు!

 

చాలా పాత మోడల్ లు అయి ఉంటాయి అనుకుంటే మీరు పొరబడినట్లే

ఐఫోన్ 14 సిరీస్ కారణంగా నిలిపివేయబడిన ఈఫోన్లు చాలా పాత మోడల్ లు అయి ఉంటాయి అనుకుంటే మీరు పొరబడినట్లే. అదేవిధంగా, Apple యొక్క తాజా iOS 16 అప్‌డేట్‌కు అర్హత లేని iPhone 6s, iPhone 7 మరియు iPhone SE 1st Gen వంటి మోడల్‌లు ఇది వరకే నిలిపివేయబడ్డాయి కాబట్టి ఏవ్ అయి ఉంటాయి అనుకుంటే మీరు షాక్ అవ్వాల్సిందే.

లేటెస్ట్ మోడల్‌లు

లేటెస్ట్ మోడల్‌లు

అవును! ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌లు అధికారికంగా లాంచ్ చేసిన తర్వాత నిలిపివేయబడిన ఈ మూడు ఐఫోన్ మోడల్‌లు పాతవి కాదు, ఇవి చాలా లేటెస్ట్ మోడల్‌లు. ఆ మూడు మోడళ్లలో, 2 ఐఫోన్ 13 సిరీస్‌కు చెందినవి మరియు మరొకటి ఐఫోన్ 12 సిరీస్‌కు చెందినవి!

ఏ ఐఫోన్ మోడల్‌లు నిలిపివేయబడ్డాయి?
 

ఏ ఐఫోన్ మోడల్‌లు నిలిపివేయబడ్డాయి?

iPhone 13 సిరీస్‌లోని iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max మోడల్‌లు మరియు iPhone 12 సిరీస్‌లోని iPhone 12 Mini మోడల్‌లు నిలిపివేయబడ్డాయి. అయితే, ఈ మూడు మోడళ్లలో రెండింటికి యాపిల్ ప్రత్యామ్నాయాలను అందించింది. అంటే iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max మోడళ్లు, iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max మోడల్‌లు కు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టబడ్డాయి!

iPhone 12 మినీ ఇక ఉండదు

iPhone 12 మినీ ఇక ఉండదు

ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌ల కోసం 'ప్రత్యామ్నాయాలు' విడుదల చేయబడినప్పటికీ, దురదృష్టవశాత్తు iPhone 12 మినీ ని పూర్తిగా "నిలిపివేయబడింది". అంటే ఇప్పటి వరకు ఈ మోడల్‌కు ప్రత్యామ్నాయ మోడల్ లేదు. అలాగే, iPhone 14 సిరీస్‌కి దిగువన ఏ చిన్న మోడల్‌ను పరిచయం చేయలేదు; బదులుగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్ ను ప్రారంభించబడింది!

వీటికి కారణం ఏమిటి?

వీటికి కారణం ఏమిటి?

వీటికి ప్రత్యేకమైన కారణం ఏది లేదు! ఈ  కొత్త హై-ఎండ్ ఐఫోన్ మోడల్‌లు ప్రవేశపెట్టబడినందున, పాత హై-ఎండ్ మోడల్‌లు ప్రతి సంవత్సరం తొలగించడం పరిపాటిగా వస్తున్న విషయమే. ఇందులో ఆశ్చర్యపోవడానికి లేదా గందరగోళానికి గురి కావడానికి ఏమీ లేదు!

iPhone 13 Pro అద్భుతమైన ఫోన్ అని చెప్పవచ్చు!

iPhone 13 Pro అద్భుతమైన ఫోన్ అని చెప్పవచ్చు!

ఎందుకంటే పనితీరు పరంగా, ప్రో మోడల్ వనిల్లా ఐఫోన్ 13 కంటే వేగవంతమైన 5-కోర్ GPU మరియు మెరుగైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది కొంచెం మెరుగైన టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది మరియు చాలా చిన్న డిస్‌ప్లే నాచ్‌తో ప్రారంభమవుతుంది!

ఎందుకంటే iPhone 13 Pro Max అనేది iPhone 13 Pro యొక్క 'పెద్ద వెర్షన్'. అంతే కాకుండా, మార్కెట్లో లభించే అత్యుత్తమ బ్యాటరీ జీవితాన్ని అందించే స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. ఇది పెద్ద 6.7-అంగుళాల OLED డిస్ప్లే కారణంగా భిన్నంగా ఉంటుంది!

కొత్త iPhone 14 సిరీస్ ధరల వివరాలు

కొత్త iPhone 14 సిరీస్ ధరల వివరాలు

మీరు పాత మోడల్‌ల గురించి పట్టించుకోకపోవచ్చు మరియు మీ దృష్టి తాజా 2022 iPhone మోడల్‌లపైనే ఉంది. కాబట్టి, కొత్త iPhone 14 సిరీస్ ధర వివరాలు ఇక్కడ ఇస్తున్నాము. గమనించండి. iPhone 14 - Rs.79,900 , iPhone 14 Plus - Rs. 89,900 , iPhone 14 Pro - Rs.1,29,900 , iPhone 14 Pro Max - Rs.1,39,900.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Discontinued These Three iPhone Models Including iPhone 13 Pro Max, iPhone 12 Mini And iPhone 11.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X