ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!

By Maheswara
|

ఆపిల్ యొక్క M1 ప్రో మరియు M1 మ్యాక్స్ చిప్‌ల తో తయారీ అయ్యే ఆపిల్ మాక్ బుక్ ప్రో 14 ఇంచులు మరియు 16 ఇంచుల ల్యాప్ టాప్ ల తయారీని నిలిపివేసింది. 14 ఇంచులు మరియు 16 ఇంచుల మ్యాక్‌బుక్ మోడల్‌లతో పాటు M1 ప్రో మరియు M1 మ్యాక్స్ చిప్‌లు 2021లోలాంచ్ చేయబడ్డాయి. అయితే, కొత్త M2 ప్రో మరియు M2 మ్యాక్స్ చిప్‌లను లాంచ్ చేసిన తర్వాత, ఆపిల్ ఇకపై M1 ప్రో మరియు M1 మ్యాక్స్ తో తయారు చేసే మ్యాక్‌బుక్‌లను సేల్ చేయడం లేదు. భారతదేశంలోని దాని ఆన్‌లైన్ స్టోర్ నుండి వినియోగదారులు M1 ప్రో మరియు M1 మ్యాక్స్ తో చేయబడిన మ్యాక్‌బుక్‌లను కొనుగోలు చేసే ఆప్షన్ ను కంపెనీ తొలగించింది.

 
Apple Discontinues MacBook Pro 14 Laptops WIth M1 Pro And M1 Max Chips, Reasons Here.

మీరు ఇప్పటికీ భారతదేశంలో M1 ప్రో మరియు M1 మ్యాక్స్ మ్యాక్‌బుక్‌లను పొందవచ్చు

 

క్రోమా, రిలయన్స్ డిజిటల్ మరియు ఇమాజిన్ స్టోర్ వంటి రిటైల్ స్టోర్‌ల లో ఇప్పటికీ 14-ఇంచుల మరియు 16 ఇంచుల స్క్రీన్ పరిమాణాలలో M1 ప్రో తో తయారు చేసే మ్యాక్‌బుక్‌లను పొందగలను. M1 ప్రో చిప్‌తో నడిచే 16-ఇంచుల మ్యాక్‌బుక్‌లో తమ వద్ద చాలా పరిమిత స్టాక్‌లు మాత్రమే ఉన్నాయని క్రోమాలోని ఒక ఉద్యోగి తెలిపారు. 16-ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో యొక్క బేస్ వేరియంట్ 512GB ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తుంది మరియు దాని తర్వాత, 1TB ఇంటర్నల్ స్టోరేజీ తో మ్యాక్‌బుక్‌ను మీరు పొందవచ్చు.

Apple Discontinues MacBook Pro 14 Laptops WIth M1 Pro And M1 Max Chips, Reasons Here.

M2 ప్రో చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఖరీదైనది

ప్రస్తుతం, M2 ప్రో చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో 16 ఇంచుల లాప్టాప్ భారతదేశంలో ధర రూ. 2,49,900 నుండి ప్రారంభమవుతున్నందున పాత M1 ప్రో చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో వినియోగదారులకు తక్కువ ధరలో సరసమైన ఎంపిక గా ఉండేది. ఒకవేళ మీరు ల్యాప్‌టాప్ ఇన్సూరెన్స్ కూడా ఎంచుకుంటే, మీకు మరింత డబ్బు ఖర్చు అవుతుంది. మీరు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో M1 ప్రో మరియు M1 మ్యాక్స్ చిప్‌లతో పాత 16 ఇంచుల మరియు 14 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో ని కూడా పొందవచ్చు.

Apple Discontinues MacBook Pro 14 Laptops WIth M1 Pro And M1 Max Chips, Reasons Here.

M2 ప్రో చిప్ తో తయారు చేయబడిన మాక్ లు చాలా ఖరీదైనవిగా భావిస్తే, మీరు M1 ప్రో తో వచ్చే ల్యాప్‌టాప్‌ల కోసం కూడా వెళ్లవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, Apple నిజంగా M1 ప్రో మరియు M2 మాక్స్ చిప్‌లకు వేగంగా రిఫ్రెష్‌ని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ చిప్ ల యొక్క శక్తి బెస్ట్ పనితీరును అందించడానికి సరిపోతుంది. M1 ప్రో తో వచ్చే మ్యాక్‌ బుక్ లు చాలా కాలం పాటు స్టాక్‌లో ఉండే అవకాశం లేదు. అందువల్ల, మీరు ఎప్పుడైనా టాప్-ఎండ్ మాక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమమైన అంశం.

భవిష్యత్తులో ఆపిల్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ గురించి సమాచారాన్ని అందించిన మింగ్-చి కువో నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ 2025 లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. కుపెర్టినో-ఆధారిత స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఈ పరికరాన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆపిల్ తో కలిసి భాగమయ్యే అంజీ టెక్నాలజీ గురించి కూడా కువో (Kuo) వివరించారు. ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ యొక్క వినూత్న డిజైన్ ద్వారా మార్కెట్లో మంచి డిమాండు ఉంటుందని తెలుస్తోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Discontinues MacBook Pro 14 Laptops WIth M1 Pro And M1 Max Chips, Reasons Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X