Home
News

Apple Diwali Offer:రూ.14,900 ధర గల ఎయిర్ పోడ్స్‌ను ఉచితంగా పొందే అవకాశం!!! మిస్ చేయకండి...

ప్రముఖ అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ఇండియాలో తన ఆన్‌లైన్ స్టోర్ ని ప్రారంభించింది. ఇండియాలో త్వరలో రాబోతున్న దీపావళి పండుగ సందర్భంగా తన వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్ ను ప్రకటించింది. యాపిల్ యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్ 11‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ దివాళి సేల్స్ ఆఫర్స్

ఆపిల్ దివాళి సేల్స్ ఆఫర్స్

ఇండియాలో ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ సంస్థలు తమ ఆన్‌లైన్ పోర్టల్ లలో అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులు షాపింగ్ చేయడం కోసం ఫెస్టివల్ అమ్మకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి పోటీగా ఆపిల్ సంస్థ తన ఆన్‌లైన్ పోర్టల్ లో దీపావళి సేల్ లను అక్టోబర్ 17 నుంచి ప్రారంబిస్తున్నది. ఆపిల్ దివాళి అమ్మకంలో  యాపిల్ ఐఫోన్ ఫోన్ల మీద అద్భుతమైన ఉచిత ఆఫర్లను అందిస్తున్నది.

ఆపిల్ దివాళి సేల్ ఎయిర్ పోడ్స్‌ ఫ్రీ ఆఫర్స్

ఆపిల్ దివాళి సేల్ ఎయిర్ పోడ్స్‌ ఫ్రీ ఆఫర్స్

ఆపిల్ దివాళి సేల్స్ లో భాగంగా  ఐఫోన్11 ను కొనుగోలు చేసిన వారికి రూ.14,900 విలువ గల ఎయిర్ పోడ్స్‌ను ఉచితంగా అందివ్వనున్నది. అయితే ఈ ఆఫర్ అందుకోవాలంటే కచ్చితంగా తాజాగా లాంచ్ అయిన ఐఫోన్11 ను యాపిల్ ఆన్ లైన్ స్టోర్ నుంచి మాత్రమే వీటిని ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,300, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.73,600 కాగా 256GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.84,100గా ఉంది. ఈ మూడు వేరియంట్ లలో దేనినైనా కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ లభిస్తుంది.

అమెజాన్ లో ఐఫోన్ 11 కొనుగోలు మీద ఆఫర్లు

అమెజాన్ లో ఐఫోన్ 11 కొనుగోలు మీద ఆఫర్లు

అమెజాన్ లో కూడా యాపిల్ ఐఫోన్ 11ను అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 11ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకం సమయంలో రూ.49,999 ధరకే విక్రయిస్తుస్తున్నట్లు సంస్థ తెలిపింది. కాబట్టి దీని ధర రూ.49,999గా ఉంటుందని అనుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఐఫోన్ 11 మరియు ఎయిర్ పోడ్స్ రెండూ కలిపి అమెజాన్‌లో కొనుగోలు చేస్తే ఇంకా తక్కువకు లభించే అవకాశం ఉంది.

ఎయిర్‌పాడ్స్ యొక్క ధరల వివరాలు

ఎయిర్‌పాడ్స్ యొక్క ధరల వివరాలు

ఆపిల్ సంస్థ ఇండియాలో ఎయిర్‌పాడ్స్ ను రూ.14,900 ప్రారంభ ధర వద్ద అందిస్తున్నది. వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి దీనిని రూ.18,900 ధర వద్ద అందిస్తున్నది. అలాగే ఎయిర్‌పాడ్స్ ప్రోను కూడా రూ.24,900 ధర వద్ద అందిస్తున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Diwali Sale 2020 Offer: Great Opportunity to Get Apple Airpods at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X