Apple దీపావళి సేల్ 2023.. ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ దీపావళి పండుగ సందర్భంగా తన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆపిల్ దీపావళి సేల్ 2023లో (Apple Diwali sale 2023) భాగంగా ఆపిల్ సాకెత్ మరియు ముంబై బీకేసీ స్టోర్‌తో సహా ఆన్‌లైన్ స్టోర్లలో ఎయిర్‌పాడ్స్‌పై భారీ తగ్గింపు ధరలను పొందవచ్చని పేర్కొంది. ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపైనా తగ్గింపులు వర్తిస్తాయని తెలిపింది.
ఐఫోన్ 14, 14 ప్లస్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆపిల్ మ్యూజిక్ 6 నెలల సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ఎయిర్‌పాడ్‌ను 50 శాతం వరకు తగ్గింపు ధరను పొందవచ్చని అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. అధికారిక స్టోర్‌లలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌లు వర్తిస్తాయని పేర్కొంది.

నవంబర్ 14 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఐఫోన్ 14, 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ప్రస్తుత ధరలు రూ.69,900 మరియు 79,999లకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు స్టార్‌లైట్, మిడ్‌నైట్, పర్పుల్, ఎల్లో, బ్లూ, రెడ్ రంగుల్లో లభిస్తున్నాయి. 256GB, 512GB వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ రెండింటిలో ఏ ఫోన్‌ను కొనుగోలు చేసినా.. కస్టమర్లు డిస్కౌంట్‌లకు అర్హులని ఆపిల్ సంస్థ తెలిపింది. లైట్‌నింగ్ ఛార్జింగ్ కేస్ కలిగిన ఎయిర్‌పాడ్స్ కేవలం రూ.9950కే కొనుగోలు చేయవచ్చు. మాగ్‌సేఫ్ ఛార్జింగ్ కేస్‌తో రెండో జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో ధర రూ.14,950కు సొంతం చేసుకోవచ్చని తెలిపింది.
మాగ్‌సేఫ్ ఛార్జింగ్ కేసుతో మూడో జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను రూ.10950లకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌ను ఎంచుకున్న కస్లమర్లు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఎడ్యుకేషన్ లేదా కార్పొరేట్ ఉద్యోగుల కొనుగోలు ప్లాన్‌ను ఉపయోగించలేరని ఆపిల్ సంస్థ స్పష్టం చేసింది.
* సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. బేస్ మోడల్ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్, పసుపు రంగుల్లో లభిస్తుంది.
అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్ ధర రూ.1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900గా ఉంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు OLED సూపర్ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications








