ఆపిల్ దీపావళి సేల్ 2024 ప్రారంభం.. ఈ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు.. పూర్తి వివరాలు..!
భారత్‌లో దీపావళి సందర్భంగా ఆపిల్ ఇవాళ్టి నుంచి ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆపిల్ దీపావళీ సేల్ 2024 (Apple Diwali Sale 2024) సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌లతోపాటు మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సహా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని ఆపిల్ తెలిపింది.
ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ICICI బ్యాంకు, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు క్యాష్‌బ్యా్‌క్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ కార్డులతో 12 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ఆపిల్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలను వెల్లడించింది.

ఐఫోన్ 16 సిరీస్‌పై కొనుగోలుపై రూ.5000 క్యాష్‌బ్యాక్, అదే మ్యాక్‌బుక్ ఎయిర్ M3, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లపై రూ.10,000 తగ్గింపును పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై రూ.8,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఆపిల్ వెబ్‌సైట్, స్టోర్‌లో ఈ ఆఫర్లను పొందవచ్చు.
ఆపిల్ దీపావళి సేల్ లో భాగంగా ఐప్యాడ్‌ల కొనుగోలుపై గరిష్ఠంగా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌పాడ్స్‌పైన రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తుల కొనుగోళ్లపై 3 నెలలపాటు ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.

లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుపై Beats Solo Buds ప్రత్యేక ఎడిషన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 4 వరకు మాత్రమే ఉంది. ఈ బడ్స్ మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయి.
ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ బడ్స్ సాధారణ ధర రూ.6,900 గా ఉంది. మ్యాటీ బ్లాక్, స్ట్రోమ్ గ్రే, ఆర్టిక్ పర్పుల్, ట్రాన్స్‌పరెంట్ రెడ్ వంటి ప్రీమిరం కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఈ ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 సిరీస్‌లతోపాటు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, SE ఎడిషన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. మ్యాక్‌బుక్‌లపైనా తగ్గింపును పొందవచ్చు. ఐప్యా్డ్ 10 జెన్, ఐప్యాడ్ మిని సహా ఇతర ఐప్యాడ్‌పై క్యాష్‌బ్యా్‌క్ ను అందిస్తోంది.
ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఆపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ SE2 ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఎయిర్‌పాడ్స్ 4 మరియు ఎయిర్‌పాడ్స్ 4 సహా ఎయిర్‌పాడ్స్ ప్రో 2 జెన్, ఎయిర్‌పాడ్స్ మ్యా్క్స్‌లను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఇప్పటికే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 లో భాగంగా ఐఫోన్‌లు సహా ఇతర ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం అయింది. ప్రస్తుతం కొనసాగుతోంది. అమెజాన్‌లో SBI కార్డు ద్వారా, ఫ్లిప్‌కార్ట్‌లో HDFC కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








