Apple దీపావళి సేల్.. ఐఫోన్ 15 ఫోన్లు, మ్యాక్‌బుక్‌లు సహా ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఉత్పత్తులపై దీపావళి పండుగ సందర్భంగా ఉత్తమ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు (iPhone 15 series smartphones), మ్యాక్‌బుక్ ఎయిర్, ఐపాడ్స్, సహా ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.
ఆపిల్ దీపావళి ఆఫర్ ముంబై, ఢిల్లీలోని ఆపిల్ రిటైల్ అపుట్‌లెట్‌లు సహా ఇతర ఆపిల్ సంస్థ ఆన్‌లైన్ స్టోర్లలో పండుగ ఆఫర్ వర్తిస్తుందని టెక్ దిగ్గజం తెలిపింది. HDFC బ్యాంక్ కార్డులు సహా ఇతర ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై తక్షణ డిస్కౌంట్ సహా నో కాస్ట్ EMI అవకాశం ఉంటుందని వెల్లడించింది.

iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు : ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు గత నెలలో విడుదల అయ్యాయి. ఈ ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.6000 తగ్గింపును పొందవచ్చు.
దీంతోపాటు ఇందుకు అదనంగా రూ.5000 తక్షణ తగ్గింపు లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ల ప్రారంభ ధరలు ఐఫోన్ 15 ధర రూ.79900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900గా ఉన్నాయి.
దీంతోపాటు ఐఫోన్ ఇతర మోడళ్లపైనా ఆఫర్లు ప్రకటించింది. ఈ దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్‌పై రూ.4000 తగ్గింపును పొందవచ్చు. దాంతోపాటు ఐఫోన్ 13 మోడల్‌పై రూ.3000, ఐఫోన్ SE మోడల్‌పై రూ.2000 తగ్గింపును పొందవచ్చని సంస్థ పేర్కొంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ (M2 చిప్) : మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాలు, మ్యాక్‌బుక్ ఎయిర్ 15 అంగుళాల ల్యాప్‌టాప్‌లపై రూ.10000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆపిల్ పేర్కొంది. అలాగే M1 చిప్‌ను కలిగిన ల్యాప్‌టాప్‌లపై రూ.8000 తగ్గింపు పొందవచ్చని ఆపిల్ సంస్థ తెలిపింది.
ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్‌ల 11 అంగుళాల, 12.9 అంగుళాల డివైస్‌లపై రూ.5000 వరకు నగదు ఆదా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు 10 జనరేషన్ ఐప్యాడ్‌లపై రూ.4000, 9వ జనరేషన్ ఐప్యాడ్‌లపై రూ.3000 మరియు ఐప్యాడ్ మినిపై రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
* భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 15 బేస్ మోడల్ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్, పసుపు రంగుల్లో లభిస్తుంది.
అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900గా ఉంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు OLED సూపర్ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications








