ఆపిల్ ఈవెంట్ 2026 తేదీ వచ్చేసింది.. ఏయే ఉత్పత్తులు లాంచ్ అయ్యే అవకాశం ఉంది?
Apple Event 2026 : ఆపిల్ నుంచి ఐఫోన్ 17e సహా బడ్జెట్ మ్యాక్‌బుక్, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో సహా ఐప్యాడ్స్ కూడా విడుదల కానున్నాయని ఇటీవలే కొన్ని లీక్స్ వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఆపిల్ నుంచి తాజాగా కీలక ప్రకటన వెలువడింది.
ఈవెంట్ ఎప్పుడు జరగనుంది :
ఆపిల్ సంస్థ మార్చి 4 వ తేదీన లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఎంపిక చేసిన వారికి ఆహ్వానాలు పంపుతోంది. ఈ ఈవెంట్ గురించి టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అనేక ఉత్పత్తుల విడుదల సహా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఏయే ప్రాంతాల్లో నిర్వహించనున్నారు? :
ఆపిల్ ఈవెంట్ 2026 న్యూయార్క్, లండన్, షాంఘైలో నిర్వహించనున్నారు. మార్చి 4 వ తేదీ 9AM ET, 2PM GMT, 10PM CST అంటే భారత కాలమానం ప్రకారం 07.30 IST గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రసారం కానుందా లేదా కార్యక్రమం అనంతరం ప్రత్యేక ప్రకటన ద్వారా వివరాలు అందిస్తారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే ఈ ఆపిల్ ఈవెంట్‌లో ఏయే ఉత్పత్తులు విడుదల కానున్నాయనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ ల్యాప్‌టాప్ :
ఆపిల్ నుంచి ఎప్పటి నుంచో బడ్జెట్ మ్యాక్‌బుక్‌లు విడుదల కానున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇటీవల వచ్చిన కొన్ని లీక్స్ ఆధారంగా బడ్జెట్ మ్యాక్‌బుక్ A18 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ అల్యూమినియం ప్రేమ్, అనేక కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
M5 చిప్‌తో మ్యాక్‌బుక్ :
బడ్జెట్ మ్యాక్‌బుక్‌తోపాటు M5 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్ విడుదల కానుందని తెలుస్తోంది. అదే విధంగా M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌సెట్‌తో మ్యాక్‌బుక్ ప్రో మోడల్ లాంచ్ కానుందని లీక్స్ వస్తున్నాయి. 14 అంగుళాలు, 16 అంగుళాల వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 17e, ఐప్యాడ్ మోడల్స్ కూడా లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం విడుదల అయిన ఐఫోన్ 16e మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఐఫోన్ 17e ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లే, A19 చిప్, 48MP కెమెరా, 18MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు M4 చిప్‌తో ఐప్యాడ్ ఎయిర్, A18 ప్రాసెసర్‌తో మరో ఐప్యాడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు మోడల్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు సహా అనేక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ ఉత్పత్తుల విడుదలపై ఆపిల్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








